ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు: కెటిఆర్ వాంగ్మూలం రికార్డు
హైదరాబాద్: ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసులో ఫిర్యాదుదారు అయిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు వాంగ్మూలాన్ని న్యాయస్థానం బుధవారం నమోదు చేసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు శ్రీరంగారావు, కే గోవర్ధ్దన్‌రెడ్డి కథనం ప్రకారం - 2013, జూన్, 20న ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో తారక రామారావుపై సెంటిమెంట్‌తో బోగాల సెటిల్‌మెంట్ శీర్షికన తప్పుడు కథనాలు ప్రసారం చేశారని యాజమాని రాధాకృష్ణపై హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.
న్యాయస్థానం 2013లోనే పిటిషన్‌ను స్వీకరించి కేసు విచారణను ఎర్రమంజిల్ కోర్టుకు బదిలీ చేసింది. విచారణలో భాగంగా కేటీఆర్ వాంగ్మూలాన్ని ఎర్రమంజిల్ కోర్టులోని 11వ స్పెషల్ మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా కేటీఆర్ కోర్టుకు సమర్పించారు. కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలంటూ ఏబీఎన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

కోర్టుకు కెటిఆర్
ఆంధ్రజ్యోతిపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో తన వాంగ్మూలం నమోదు చేయడానికి కెటిఆర్ ఇలా వచ్చారు.

కోర్టుకు కెటిఆర్
తెలంగాణ మంత్రి కెటి రామారావు కోర్టులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి ఇలా వచ్చారు.

కోర్టుకు కెటిఆర్
తెలంగా మంత్రి కెటి రామారావు బుధవారం కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై వేసిన పరువు నష్టం దావాలో కెటిఆర్ తన వాంగ్మూలం వినిపించారు.

కోర్టుకు కెటిఆర్
ఆంధ్రజ్యోతిపై వేసిన పరువు నష్టం దావాలో ఫిర్యాదుదారైన కెటి రామారావు వాంగ్మూలాన్ని కోర్టు బుధవారం నమోదు చేశారు.












Click it and Unblock the Notifications