పరిస్థితి నియంత్రణలోనే.. వీలైనంత త్వరగా కరోనా గండాన్ని గట్టెక్కే చర్యలు... కేటీఆర్ కోవిడ్ యాక్షన్ ప్లాన్...
తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. కరోనా వేళ తెలంగాణతో పాటు నాలుగైదు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ కల్ప తరువులా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని... రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయని స్వయంగా కేంద్రమంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. బుధవారం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీతో భేటీ సందర్భంగా ఆ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు.

వీలైనంత త్వరగా కోవిడ్ నుంచి బయటపడేందుకు...
అందరి సహకారంతో రాష్ట్రంలో కరోనా గండాన్ని గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నామని తాజా సమావేశంలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సాధ్యమైనంత వేగంగా కోవిడ్ నుంచి రాష్ట్ర ప్రజలను బయటపడేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో మందులు,ఇంజెక్షన్లు,ఆక్సిజన్ కొరత ఉండకూడదని సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తి స్థాయి బెడ్లు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అదనంగా మరిన్ని రెమిడెసివిర్ ఇంజెక్షన్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు.

మితిమీరిన ఇంజక్షన్లు వద్దు : కేటీఆర్
రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లు ఇష్టారీతిన వాడవద్దని ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని కేటీఆర్ వెల్లడించారు. ప్రతి రోజూ ఆస్పత్రుల్లో వాడే ఆక్సిజన్‌పై వివరాలున్నాయని తెలిపారు. మితిమీరిన ఇంజక్షన్లు, అనవసర ఆందోళనలు వద్దని విజ్ఞప్తి చేశారు. నిత్యం కలెక్టర్లు వైద్య అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని... త్వరలోనే వ్యాక్సిన్,రెమ్‌డిసివిర్,ఆక్సిజన్ ఉత్పత్తిపై చర్చించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశవమవుతుందని ప్రకటించారు.

ఇంటింటి సర్వే,ఆక్సిజన్ ఆడిట్‌పై...
రాష్ట్రంలో ఇప్పటివరకూ 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. ఇంటింటి సర్వే చేస్తూ అవసరమైనవారికి మెడికల్ కిట్స్ అందిస్తున్నామని చెప్పారు. హోం ఐసోలేషన్ కిట్లతో ఎంతోమంది ప్రాణాలను కాపాడామని తెలిపారు.రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను భారీగా పెంచామని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సప్లైపై చర్చించామని... డిమాండ్,సప్లై వివరాలు సేకరించామని తెలిపారు. ప్రభుత్వం ఆక్సిజన్ ఆడిట్ నిర్వహిస్తోందని.... ఎప్పటికప్పుడు కరోనా చర్యలను ముమ్మరం చేస్తున్నామని వెల్లడించారు. తాజా సమావేశంలో టీకాల కోటా,గ్లోబల్ టెండర్లపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ వరుసగా భేటీ అవుతూ సమగ్ర కార్యాచరణ రూపొందింస్తుందన్నారు.
Recommended Video

తెలంగాణలో పరిస్థితులపై కేంద్రం సంతృప్తి...
తెలంగాణలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని చెప్పారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్,రెమ్‌డివిసిర్ ఇంజక్షన్లు,వ్యాక్సిన్లు,టెస్టింగ్ కిట్లు,వెంటిలేటర్ తదితర మెడికల్ సప్లై కోటా పెంచుతామన్నారు. బుధవారం కేంద్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సీఎం కేసీఆర్ దేశాల మేరకు మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కరోనా మొదటి వేవ్‌లో 18,232 బెడ్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 53,775కి పెంచినట్లు చెప్పారు. అలాగే ఆక్సిజన్ బెడ్లను 9123 నుంచి 20వేల పైచిలుకు,ఐసీయూ బెడ్లను 11వేల పైచిలుకుకి పెంచినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications