టీ కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ - రాజీ పడతారా, సై అంటారా..!!

తెలంగాణలో అధికారం పై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు అన్ని వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక దాదాపు పూర్తయింది. ప్రచారం కోసం ముఖ్య నేతలు తరలి వస్తున్నారు. బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. బీఆర్ఎస్ పైన పూర్తి ఆధిపత్యం సాధిస్తామని భావిస్తున్న జిల్లాలో టెన్షన్ మొదలైంది. దీంతో, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది.

ఎన్నికల బరిలోకి సీపీఎం
తెలంగాణలో కాంగ్రెస్ ఈ సాధి భారీ అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయి రాజకీయ నిర్ణయాల్లో భాగంగా తెలంగాణలోనూ వామపక్ష పార్టీలతో పొత్తుకు సిద్దమైంది. కానీ, చివరి వరకు పొత్తుల పైన తేల్చకపోవటంతో ఇప్పటికే సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. సీపీఐకు కొత్తగూడెం సీటు..ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది.

CPM Announces Contesting Candidates list for 14 seats in Telangana, may become trouble for Congress

సీపీఎంతో లెక్క తేల్చలేదు. దీంతో, సీపీఎం తెలంగాణ అసెంబ్లీ బరిలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. 14 సీట్లకు అభ్యర్దులను ప్రకటించింది. సీపీఎం పోటీ చేసే స్థానాల్లో మాత్రం మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. జాబితా విడుదల వార్త తెలిసి వెంటనే సీఎల్పీ నేత భట్టి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి ఫోన్ చేసారు. జాబితా ఆపాలని కోరారు. అప్పటికే ప్రకటన పూర్తయిందని తమ్మినేని స్పష్టం చేసారు.

ఖమ్మం జిల్లాలో కొత్త లెక్కలు
14 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించిన సీపీఎం..త్వరలో మరో మూడు స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేస్తామని వెల్లడించింది. సీపీఎం మేనిఫెస్టో విడుదల చేసింది. సీపీఐ పోటీ చేసే కొత్తగూడెం స్థానంలో తమ మద్దతు ఉంటుందని సీపీఎం పార్టీ రాష్ట్ర నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం జాబితాలో పాలేరు - తమ్మినేని వీరభద్రం, భద్రాచలం - కారం కుల్లయ్య, అశ్వారావుపేట - పిట్టల అర్జున్, మధిర - పాలడుగు భాస్కర్, వైరా - భూక్యా వీరభద్రం, ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లి - మాచర్ల భారతి, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్ - బొజ్జ చిన్న వెంకులు, భువనగిరి - నరసింహా, జనగాం - మక్కు కనకరెడ్డి, ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య, పటాన్ చెరు - మల్లికార్జున్, ముషీరాబాద్ - దశరథ్ పేర్లు పార్టీ ప్రకటించింది.

రాజీ కుదిరేనా
నల్గొండ.. కోదాడ, హుజుర్‌నగర్‌లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటిస్తామని వీరభద్రం స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం ఇన్ని రోజులు వేచి చూశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఇందులో భాగంగానే ఒంటరిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించామని వెల్లడించారు. ఇక, ఖమ్మం జిల్లా పైన కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది.

అదే జిల్లాలో సీపీఎం పోటీలో ఉండటం నష్టం చేస్తుందనే వాదన ఉంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. అక్కడ నుంచి తమ్మినేని బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో, ఇప్పుడు సీపీఎం జాతీయ నాయకత్వంతో కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. కాంగ్రెస్ తో ఇప్పుడు సీపీఎం కు సయోధ్య కుదురుతుందా..లేక పోటీ కే సై అంటుందా.. ఫలితం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+