Year Ender 2023: ఈ ఏడాదిలో తెలంగాణలో పెరిగిన నేరాలు, సైబర్ మోసాలు, తగ్గిన ప్రమాదాలు
హైదరాబాద్: రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం (2023)లో 8.97 శాతం నేరాలు పెరిగాయని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. అదే సమయంలో ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. తెలంగాణ వార్షిక నేర నివేదికను ఆయన శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల సీపీలు వార్షిక నేర నివేదికను ఇదివరకే విడుదలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పర్యవేక్షణ కోసం మరింత శ్రమిస్తామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని చెప్పారు. ఒక శాతం రహదారి ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు. రాష్ట్రంలో 41 శాతం కోర్టు శిక్షలు, జీవిత ఖైదు 39 శాతం పెరిగాయని డీజీపీ చెప్పారు.

నేరాలకు పాల్పడుతున్న 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించామని డీజీపీ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 89,783 సైబర్ మోసాల ఫిర్యాదులు వచ్చాయని, ఇది దేశం మొత్తంలో 8వ శాతంగా ఉందని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు.
రాష్ట్రంలో 14,271 కేసులు నమోదయ్యాయన్నారు డీజీపీ. దేశంలోనే కేసుల నమోదులో తెలంగాణ ముందుంది. సైబర్ మోసాల కేసుల నమోదులో తెలంగాణ 16 శాతంతో మూడో వరుసలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ మోసాల్లో రూ.133 కోట్లు అనుమానాస్పద లావాదేవీలు సీజ్ చేశామన్నారు. రూ.7.7కోట్లు మొత్తం బాధితులకు తిరిగి అందజేశామని తెలిపారు. 342 మంది సైబరు నిందితులను అరెస్టు చేశామని డీజీపీ రవి గుప్తా వివరించారు. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది ఎక్కువగా సైబర్ మోసాలు జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications