మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు విక్టరీ వెంకటేష్: క్రిమినల్ కేసు నమోదు
Venkatesh Daggubati: విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. పేరుకు తగ్గట్టే పండగ రోజున అంటే 14వ తేదీన విడుదల కానుందీ మూవీ. అనిల్ రావిపూడి దర్శకుడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, సాయికుమార్.. ఇతర ముఖ్యపాత్రలను పోషించారు.
అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొందీ మూవీ. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోందీ మూవీ యూనిట్. శ్రీవేంకటేశ్వర బ్యానర్స్ కింద దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. మొన్నటికి మొన్న నిజామాబాద్‌లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల వల్ల దిల్ రాజు విమర్శలను ఎదుర్కొన్నారు. క్షమాపణలు సైతం చెప్పాల్సొచ్చిందాయనకు.

ఇప్పుడు తాజాగా హీరో వెంకటేష్‌పై ఏకంగా క్రిమినల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు రానా దగ్గుబాటి, నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు, అభిరామ్‌పై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు పెట్టారు. 448, 452, 458, 120బీ సెక్షన్ల కింద ఈ క్రిమినల్ కేసు ఫైల్ అయింది.
ఫిల్మ్‌నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో సురేష్‌బాబు- ఏ1, వెంకటేష్- ఏ2, దగ్గుబాటి రానా- ఏ3, దగ్గుబాటి అభిరామ్- ఏ4గా కేసు పెట్టారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్‌నగర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
నందకుమార్ అనే వ్యక్తికి చెందిన హోటల్.. దక్కన్ కిచెన్. దగ్గుబాటి కుటుంబంతో స్థలం సంబంధిత వివాదాలు ఉన్నాయి. దీనితో ఆయన సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉన్న సమయంలో 2022లో కొందరు బౌన్సర్లతో కలిసి దక్కన్ కిచెన్ హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం పాక్షికంగా ధ్వంసం చేసింది.
దీనితో ఆయన నందకుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు యధాతథ స్థితిని కొనసాగించాలని, ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలకు పూనుకోకూడదంటూ దగ్గుబాటి కుటుంబాన్ని ఆదేశించింది. దీన్ని లెక్కచేయకుండా గత ఏడాది జనవరిలో ఆ హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హోటల్‌ను కూల్చివేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసి సమగ్రంగా విచారణ జరపాలంటూ ఫిలిం నగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications