కరోనా కలికాలం.!ఖాళీ అవుతున్న ఊళ్లు.!రద్దీగా మారుతున్న స్మశానాలు.!కాల్చడానికి కర్రలు కూడా కరువే.!
హైదరాబాద్ : సమాజంలో అత్యంత దయనీయపరిస్థితులు చోటుచేసుకున్నాయి. కరోనా రెండోదశ విలయతాండవానికి చాలా మంది అశువులుబాస్తున్నారు. అయినవాళ్లు, స్నేహితులు బంధువులు అనేక మంది అకాల మరణానికి గురవుతున్నారు. కరోనా నిబందనల పేరుతో కడచూపుకు కూడా నోచుకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక స్మశానాల పరిస్దితి అత్యంత దారుణంగా తయారయినట్టు తెలుస్తోంది. అడపా దడపా వచ్చే శవాలకు అంతిమ సంస్కారం చేసే వల్లకాడులు అనేక శవాలతో కిటకిటలాడుతున్నాయి. శవాలకు చితి పేర్చడానికి గాని, దహనం చేయడానికి గాని కర్రలు లేక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video

అత్యంత దయనీయ పరిస్థితులు.. కరోనా చేస్తున్న విలయతాండవం.
రాష్ట్రంలో మరియు జిల్లాల్లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో శ్మశాన వాటికల్లో రద్దీ పెరిగి అంతక్రియల ఖర్చు కూడా భరించలేని విధంగా తయారయ్యింది. అసలే సామాన్య, పేద కుటుంబాలు వైద్యం నిమిత్తం శక్తికి మించి ఖర్చులు చేసి అప్పుల పాలై కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. ఇక చివరికి అంతక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలక తల్లడిల్లి పోతున్నాయి. దయనీయమైన ఆర్థిక పరిస్థితుల్లో ఆత్మీయ బంధాలను ప్రేమాభిమానాలను సైతం కాదని మృత దేహాలను అనాధ శవాల్లాగా వదిలేస్తున్నారు.

రోజు రోజుకూ పెరుగుతున్న అనాధ శవాల సంఖ్య.. దహనం చేగడానికి కల్ప కరువు..
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో మేమున్నాము అంటూ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అయిన సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్, అనాధ శవాలకు పూర్తి ఉచితంగాను మరియు పేద వారికి అతి తక్కువ రుసుముతో సంప్రదాయ రీతిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నది. కానీ ప్రస్తుతం కోవిడ్ మరణాల సంఖ్య పెరగడంతో దహనానికి అవసరమైన కలప లభ్యత మరియు వాటి ధర కూడా ఈ సంస్థ సేవలకు తీవ్రమైన సమస్యగా పరిణమించింది.

కలపను సేకరిస్తున్న స్వచ్చంద సంస్థ.. అదే అసలైన మానవత్వం..
ఈ ఇబ్బందులను టీవి మరియు వార్త పత్రికల ద్వారా తెలుసుకున్నభారత ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓ కి చెందిన అడిషనల్ చీఫ్ ఇంజనీర్ మరియు ఎస్టేట్ ఆఫీసర్ గౌస్ మొహిద్దిన్ తన పరిధిలోని ఎస్టేట్ ఏరియాలో వున్న ఎండి పోయిన, కూలి పోయిన చెట్లను, కొమ్మలను తన సిబ్బంది సహాయంతో సేకరించి, వాటిని యంత్రంతో కోయించి, రవాణా సౌకర్యం కల్పించి సుమారు 15 మెట్రిక్ టన్నుల కలపను సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన కే. రామేశ్వర రావు అందజేసి తన మానవత్వానిని చాటుకున్నారు.

సచ్చందంగా ముందుకొస్తున్న సేవా సంస్థలు.. వారి సేవలు మర్చిపోలేం అంటున్న సామాన్యులు
ఈ సందర్భంగా రామేశ్వర రావు స్పందిస్తూ క్లిష్ట సమయంలో తమ సంస్థ సేవా కార్యక్రమాలను నిరాటంకంగా కొన సాగడానికి ప్రధానంగా కావాల్సిన కలపను అందించిన గౌస్ మొహిద్దిన్ గారికి వారి సిబ్బంది అయిన సాజి థామస్, కరుణాకర్ రెడ్డి, రవి తదితరులను మరీ ముఖ్యంగా కలప సేకరణలో పాల్గొన్న కార్మికులను మనస్పూర్తిగా అభినందించారు. దీనికి ప్రతిస్పందిస్తూ, గౌస్ మొహిద్దిన్, ఈ సంస్థ చేసే మానవత్వ సేవలు, పుణ్య క్రియలు చనిపోయిన వారికి ఆత్మ శాంతిని, వారి ఆత్మీయులకు మనశ్శాంతిని ప్రసాదిస్తాయి అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications