Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి హరీష్ రావు తో సీఎస్ భేటీ.! 9,10షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఆస్తుల వివరాలు పరిశీలన.!

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో షెడ్యూల్ తొమ్మిది మరియు షెడ్యూల్ పదికి సంబంధించిన అంశాలు మరియు పబ్లిక్, గవర్నమెంట్ ఆస్తుల పై చర్చించారు. షెడ్యూల్ తొమ్మిది మరియు షెడ్యూల్ పది క్రింద ఉన్న సంస్థలపై శాఖల వారీగా మంత్రి టి. హరీష్ రావు సమీక్షించారు. విటితో పాటు ప్రభుత్వ మరియు వాటి శాఖల వారీగా ఉన్న ఆస్తుల డేటా సేకరణపై సమీక్షించారు. నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ప్రతి విభాగం కింద ఉన్న ప్రభుత్వ భవనాలు లేదా ఆస్తుల సంఖ్య వివరాలను సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

CS meets Minister Harish Rao!According to 9,10 schedule reviewed common property details.!

2024వ సంవత్సరానికి గాను ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కు కాకుండా కేవలం తెలంగాణ కు మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆస్తులపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్ రావు. ఈ సమావేశంలో టి.ఆర్. అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి. ఐ.రాణి కుముదిని, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఇపిటిఆర్ఐ డిజి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి. ఎ. శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బి.సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ఐటిఇ & సి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ , వివిధ విభాగాల కార్యదర్శులు హాజరయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+