తప్పుకోనున్న శాంతకుమారి - కొత్త సీఎస్ ఖరారు..!!

తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనా పరంగా - రాజకీయంగా సీఎం రేవంత్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ ఖరారు అయిందని భావించిన వేళ కొత్త మంత్రుల సమీకరణాల్లో హైకమాండ్ నిర్ణయం పెండింగ్ లో పడింది. దీంతో, మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాలనా పరమైన అంశాల్లోనూ వేగం పెంచాలని బావిస్తున్నారు. ఈ సమ యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు పైన కసరత్తు మొదలైనట్లు సమాచారం.

రాష్ట్రంలో పాలనా పరమైన నిర్ణయాల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. అందులో భాగంగా కసరత్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు పైన చర్చ సాగు తోంది. ప్రస్తుత సీఎస్ శాంతకుమారి ఈ నెలాఖరు న పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగానే వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో శాంతకుమారి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరులో శాంత కుమారి పదవీ విరమణ ఉండటంతో.. తొలుత మరో మూడు నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని భావించారు. అయితే, ఇప్పుడు శాంత కుమారి ఈ నెలాఖరున తన బాధ్యత నుంచి తప్పుకునేందుకు సిద్దమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

cs-santha-kumari-to-retire-by-end-of-this-month-new-names-in-the-list

శాంత కుమార్ తన ​నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉంది. శాంత కుమారి స్థానంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దాదాపు ఖరారైనట్లు చెబుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందిన వారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్ అవనున్నారు. ఇక, 1989 ఐఏఎస్‌ బ్యాచ్​‌కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ కొత్త సీఎస్ విషయంలో తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+