ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్... శంషాబాద్‌కు అమర జవాను మురళీకృష్ణ పార్థివ దేహం... సీపీ సజ్జనార్ నివాళి...

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ(32) పార్థివ దేహం మంగళవారం(ఏప్రిల్ 5) రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ అమర జవాను పార్థివ దేహానికి నివాళులర్పించారు.

అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ..'అమరజవాన్లకు తెలంగాణ పోలీస్ శాఖ తరుపున జోహార్లు తెలియజేస్తున్నాం. అమరజవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. అమరజవాన్ల స్పూర్తిగా తీసుకుని పనిచేయాలి. మురళీకృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలా అండగా నిలుస్తాం...' అని తెలిపారు.

cyberabad cp sajjanar tributes to crpf jawan mortal remains at shamshabad airport

మురళీకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మురళీకృష్ణ పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలించారు. బుధవారం(ఏప్రిల్ 6) అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో మొత్తం 22 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన జవాన్ జగదీష్(27),గుంటూరు జిల్లాకు చెందిన శాఖమూరి మురళీకృష్ణ(32) ఉన్నారు. మరో 13 మంది జవాన్లు నక్సల్స్ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌కి చెందిన రాకేశ్వర్ అనే జవాన్ ఇప్పటికీ నక్సల్స్ చెరలోనే ఉన్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు భావిస్తున్నారు.

‌మావోయిస్టులు ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే ఈ దాడికి పాల్పడ్డారని సీర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ గురించి ముందుగానే తెలుసుకుని మెషీన్ గన్స్, అండ‌ర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచ‌ర్స్‌, దేశీ రాకెట్ల‌తో దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. యాంటీ మావోయిస్ట్ క‌మాండో బెటాలియ‌న్ ఫ‌ర్ రిజ‌ల్యూట్ యాక్ష‌న్ (CoBra) యూనిట్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్ గ్రూప్ (DRG), స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ (STF) విభాగాల‌కు చెందిన మొత్తం 400 మంది భ‌ద్ర‌తాసిబ్బంది సుక్మా-బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లోని అట‌వీ ప్రాంతంలో కూంబింగ్ ఆప‌రేష‌న్‌కు వెళ్లినట్లు తెలిపారు.మావోయిస్టుల వైపు కూడా భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పారు. అమరులైన జ‌వాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్ల‌ను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+