Cyber Crime: ఎస్బీఐ కస్టమర్ కేర్ పేరుతో మోసం.. అరెస్ట్ చేసిన పోలీసులు..

ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌లుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 4న, ఓ వ్యక్తి ఎక్కువ మొత్తంతో క్రెడిట్ కార్డ్ బిల్లులను అందుకున్నాడు. దీంతో అతను నెట్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసశాడు. బాధితుడు ఒక నంబర్‌ను సంప్రదించాడు. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి తాము SBI కస్టమర్ కేర్ డిపార్ట్‌మెంట్ అనిచెప్పాడు.

నిందితుడు బాధితుడిని కార్డు సబంధంచి వివరాలు అడిగాడు. ఓటీపీ కూడా చెప్పమన్నాడు. దీంతో బాధితుడి ఖాతా నుంచి పదమూడు వేల రూపాయలు డెబిట్ అయ్యాయని గుర్తించాడు. సైబరాబాద్‌లోని కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముఠా ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సైబర్ క్రైమ్ విభాగం గుర్తించింది.

sbicustomercarescam

పోలీసులు అక్కడికి ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో అమన్ పర్వేజ్ ఖాన్, ఆషిక్ అలీ, అష్రఫ్ జావేద్, శుభమ్ కుమార్, అభిషేక్ భరద్వాజ్‌, నిహాల్ ఉన్నారు. వీరిని విచారించగా ఆశ్చర్య విషయాలు బయటకొచ్చాయి. నిందితులు ఆధునిక సాంకేతకతలను వినయోగించి ఎస్బీఐ కస్టమర్ కేర్ ప్రతినిధుమలంటా లక్షల్లో దోచుకున్నాట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాపై తెలంగాణలో 187 కేసులు ఉండగా.. దేశవ్యాప్తంగా 1,502 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందిథులు ఢిల్లీ కేంద్రంగా ఈ దందాను ప్రారంభించారు. నిహాల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులదారుల వివరాలు తెలుసుకుని మిగిలన వారికి ఇస్తాడు. మిగతా వారు ప్రి యాక్టివేటెడ్ సిమ్ లను ఇతరుల పేరుతో తీసుకుంటారు. ఆ తర్వాత వీరు ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్ అంటూ ఆన్ లైన్ ఓ నంబర్ ను పెడతారు. ఎవరైనా ఆ నంబర్ కు ఫోన్ చేస్తే తాము ఎస్బీఐ కస్టమర్ కేర్ అంటూ డబ్బులు కాజేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+