ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ట్విస్టు - తాజా నిర్ణయంతో..!!
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులైన రామచంద్ర భారతి, సింహ యాజ్, నందకుమార్‌లను పోలీసులు కేసులు నమోదు చేసి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందులను రిమాండ్‌కు అప్పగించాలని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై విచారించిన కోర్టు, నిందితుల రిమాండ్‌ను రిజక్ట్ చేసింది. అంతేకాదు, ముగ్గురు నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుపట్టింది. పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ముగ్గురు నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ అనేది పీసీ యాక్ట్‌లో అప్లికబుల్ కాదని, ముందు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, వీరికి పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.

అదే సమయంలో హైకోర్టులో సైబరాబాద్ పోలీసులు హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ను తిరస్కరించటం పైన హైకోర్టులో ఈ పిటీషన్ వేసారు. ముగ్గురు నిందితులను రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు పిటీషన్ లో కోరారు. మెజిస్ట్రేట్ తప్పుడు ప్రొసీజర్ అమలు చేసారని అందులో పేర్కొన్నారు.ఈ పిటీషన్ ను హైకోర్టు మధ్నాహ్నం విచారించే అవకాశం ఉంది.దీంతో, కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో ఈ కేసును సిట్ లేదా సీబీఐతో విచారించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications