మార్పు: ఛాయ్ వాలాగా కరుడుగట్టిన నేరస్తుడు (ఫోటోలు)
హైదరాబాద్: నేరాలు చేయడంలో నేరగాళ్లకు ఫోన్లు, గంజాయి అందించడంలో జైలుకు వెళ్లినవారికి బెయిల్ ఇప్పించడంలో ఘనాపాఠిగా పేరొందిన సుంకరి ప్రసాద్ అలియాస్ ఆళ్లగడ్డ ప్రసాద్ రెడ్డి (45) తాజాగా అవన్నీ వదిలేసి టీస్టాల్ నడుపుకొనేందుకు సిద్ధమయ్యాడు.
ఎల్బీనగర్ కూడలిలో పోలీసుల ఆర్ధిక సాయంతో గురవారం అతడి కోసం ఏర్పాటు చేసిన టీస్టాల్‌ను సైబరాబాద్ పోలీస్ క్రైం డీసీపీ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతనేరస్తుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, వారిలోని స్కిల్స్ బట్టి జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు.

మార్పు: ఛాయ్ వాలాగా కరుడుగట్టిన నేరస్తుడు
ప్రకాశం జిల్లా రాచెర్ల మండలం గుడిమెట్లకు చెందిన ప్రసాద్ ఏడోతరగతికే చదువుకు స్వస్తిపలికి 18 ఏళ్లకే నేరమయ జీవితంలోకి అడుగుపెట్టాడు. మొదట ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో బాంబు పేలుళ్ల కేసులో అరెస్టై జైలుకెళ్లాడు. అనంతరం కర్నూలులో ఓ హత్యకు పాల్పడి తిరిగి జైలుకెళ్లాడు.

మార్పు: ఛాయ్ వాలాగా కరుడుగట్టిన నేరస్తుడు
ప్రకాశం, కర్నూలు, కడప, నల్గొండ, మెదక్, విజయవాడ, హైదరాబాద్, సైబదరాబాద్ ప్రాంతాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, తదితర 120 కేసులు అతడిపై నమోదయ్యాయి.

మార్పు: ఛాయ్ వాలాగా కరుడుగట్టిన నేరస్తుడు
గత ఏప్రిల్‌లో ఓ చోరీ కేసులో అరెస్టై 5 నెలలు జైలుకు వెళ్లివచ్చిన ప్రసాద్ రెడ్డి తాను నేరమయ జీవితానికి స్వస్తి చెప్పి అందరిలాగే కష్టపడి బతికేందుకు అవకాశం కల్పించాలని సీపీ ఆనంద్‌కు విన్నవించుకున్నాడు.

మార్పు: ఛాయ్ వాలాగా కరుడుగట్టిన నేరస్తుడు
ఈ మేరకు అతడి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు స్వయంగా వారే ఆర్ధిక సాయం చేసి టీ కొట్టు పెట్టించారు.

మార్పు: ఛాయ్ వాలాగా కరుడుగట్టిన నేరస్తుడు
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ క్రైం డీసీపీ నవీన్ కుమార్ మాట్లాడుతూ నేరమయ జీవితానికి అలవాటుపడిన వారు మారేందుకు దశలవారీగా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారి నిపుణతను అనుసరించి స్వయం ఉపాధి చూపుతున్నామన్నారు.

మార్పు: ఛాయ్ వాలాగా కరుడుగట్టిన నేరస్తుడు
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ తఫ్‌సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణగోపాల్, సీఐ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ సీఐలు మోహన్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, కాశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications