Cyber Crime: కొంపముంచిన ఆన్‍లైన్ గేమ్.. యువకుడి అకౌంట్ నుంచి రూ.95 లక్షలు మాయం..

లాక్ డౌన్ కాలం చాలా మంది పిల్లలు, యువత ఆన్ లైన్ ఆటలకు అడిక్ట్ అయ్యారు. లాక్ డౌన్ సమయంలో పాఠశాలు, కాలేజీలు లేకపోవడంతో పిల్లలు, యువత తెల్లరి లేచింది మొదలు.. పడుకునే వరకు ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారు. ఇలా వారు ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారు. అయితే మామూలుగా ఆడితే ఫర్వాలేదు.. కానీ డబ్బులు పెట్టి ఆడడం మొదలు పెట్టారు. ఇలా చాలా మంది డబ్బును పోగొట్టుకున్నారు.

రూ.95 లక్షలు

రూ.95 లక్షలు

తాజాగా యువకుడు ఆన్ లైన్ గేమ్ ఆడి ఏకంగా రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాబాద్ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు శ్రీపాల్ హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్నాడు.

TSIIC

TSIIC

చిన్న కొడుకు హర్షవర్ధన్ రెడ్డి నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు.కొద్ది రోజుల క్రితం వీరు తమ భూములను ప్రభుత్వం TSIICకి అప్పగించింది. ఆ భూమికి సంబంధించిన పరిహారం కింద ఎకరానికి రూ.10.5 లక్షల కింద రూ.1.05 కోట్లు శ్రీనివాస్ రెడ్డి అకౌంట్ లో జమ అయ్యాయి. ఇంతలో హర్షవర్ధన్ 'king 527' అనే ఆన్ లైన్​ గేమ్ ను తన ఫోన్లో డౌన్​ లోడ్​ చేసుకొని సరదాగా ఆడాడు.

సైబర్​ క్రైమ్​

సైబర్​ క్రైమ్​

ఈ ఆటే కొంప ముంచింది. గేమ్ ఆడుతుండగానే బ్యాంక్​ అకౌంట్​ లోని దాదాపు రూ.95 లక్షలు మాయమయ్యాయి. అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ అయిన విషయాన్ని యువకుడు వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వెంటనే వారు సైబర్​ క్రైమ్​ పోలీసులకు కంప్లెంట్ చేశారు.

పరిహారం డబ్బు

పరిహారం డబ్బు

తమకు జీవితంలో ఆసరాగా ఉంటాయని భావించిన భూ పరిహారం డబ్బులన్నీ క్షణాల్లో అకౌంట్​ నుంచి ఖాళీ అయ్యాయని తలుచుకొని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్​ నేరగాళ్లను గుర్తించి, తమకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ఆ డబ్బులతో శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద అర ఎకరం పొలాన్ని కొనాలన్నారు. కానీ డబ్బు మాయం కావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+