Cyclone Murasu: మురసు తుపాను బీభత్సం.. అత్యంత భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్రరూపం దాల్చి మురసు తుపానుగా దూసుకొస్తోంది. గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో తుపాను కదులుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు 80 కి.మీ. దూరంలో అలాగే కావలికి 90 కి.మీ. దూరంలో ఇక ఒంగోలుకు 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్లు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఏపీలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మురసు తుపాను ప్రభావం తెలంగాణపైనా గట్టిగానే పడింది. రాష్ట్రంలోని నల్గొండ, నాగర్‌ కర్నూల్ జిల్లాల్లో నవంబర్ 3 మంగళవారం అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఇక మిగతా జిల్లాల్లోనూ భారీగా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తుపాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు 1 నుంచి 1.5 మీటర్ల మేర సముద్రపు నీటితో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

CycloneMurasu Havoc caused extremely heavy rainfall Red Alert for Andhra Pradesh and Telangana

ఇక తుపాను తీవ్రత కారణంగా కోస్తా తీరంలోని ఓడరేవుల్లో అధికారులు ప్రమాద సూచికలను ఎగురవేశారు. ఈ మేరకు అత్యంత ప్రమాదకర పరిస్థితులను సూచిస్తూ బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం, వాడరేవు పోర్టుల్లో 10వ నంబర్ సిగ్నల్ జారీ చేశారు. అలాగే మచిలీపట్నం పోర్టులో 9, కృష్ణపట్నంలో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+