కేసీఆర్‌కు సూచన: దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందన్న డీ రాజా
ఖమ్మం: బీజేపీని ఓడించడమే ప్రస్తుతం అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్.. హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నాన్నారు.
తెలంగాణలో సుపరిపాలన అందుతోందన్న డీ రాజా.. సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, నిరంతరం కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మంచి పథకాలు తేవాలని సూచించారు.

భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని డీ రాజా ఆరోపించారు. దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడిందన్నారు. భారత్ హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందన్నారు. కేంద్రం విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను విస్మరిస్తోందన్నారు. మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారన్నారు.
మోడీ.. పేదలు, రైతుల పక్షాన లేరని.. అదానీ, అంబానీ, టాటా బిర్లా జపం చేస్తున్నారని డీ రాజా ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని.. కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దు మీరుతున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని, బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని వ్యాఖ్యానించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications