నాన్నా... జూబ్లీహిల్స్‌లో వాళ్లే గెలుస్తారంటగా..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి మధ్య హోరాహోరీ పోరు ఏమైనా జరుగుతుందా? అంటే అటువంటిదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక జరుగుతుందనే విషయమే తెలియదంటే అతిశయోక్తికాదు. అంటే ప్రజలు ఈ ఎన్నిక గురించి ఎంత విముఖంగా ఉన్నారో అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సానుభూతి ఓట్లద్వారా గెలుపొంది నగరంలో తమ పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ ఇది మంచి సమయంగా భావించింది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు కాంగ్రెస్ కు వేస్తే నగరంలోని సెటిలర్లు మాత్రం బీఆర్ఎస్ కు వేశారు. దీనికి కారణాలు అనేకం. మీరు వ్యాపారాలు ఎలా చేసుకుంటారో చూస్తామని ఆ పార్టీ నాయకులు బెదిరించడంలాంటివి అనేకం ఉన్నాయి.
మారిన సెటిలర్ల ఆలోచన
అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడంతో సెటిలర్ల ఆలోచన మారింది. దీనికితోడు ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఏ పార్టీ పోటీకి అభ్యర్థిని నిలబెట్టకుండా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటిస్తే మద్దతిస్తూ వచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈ సాంప్రదాయానికి కేసీఆర్ చరమగీతం పాడారు. 2007లో పీజేఆర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టి దుష్ట సంప్రదాయానికి నాంది పలికారు. మద్దతు కోరదామని ఆరోజు కేసీఆర్ ఇంటికి వస్తే మహిళలని కూడా చూడకుండా మూడు గంటలు పీజేఆర్ కుటుంబ సభ్యులను ఎండలో నిలబెట్టారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తాను కూడా పోటీకి అభ్యర్థిని నిలబెట్టింది. ఇక్కడ గెలవడానికి మైనార్టీ ఓటర్లు ముఖ్యం. మజ్లిస్ కు ఉన్న 80 వేల ఓటింగ్ లో చాలావరకు కాంగ్రెస్ కు పడేలా వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీనిపై ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీయే తన పార్టీ అన్నంతగా అసదుద్దీన్ ఒవైసీ చెలరేగిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పాతబస్తీలో మా జోలికి రావొద్దు.. మీకు మద్దతిస్తామంటూ రాయబారం పంపించినట్లు సమాచారం. ఇరువర్గాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కొనసాగిస్తున్నాయి. అయితే చివరి నిముషంలో ఒవైసీ కాంగ్రెస్ కు హ్యాండిస్తాడా? అనే అనుమానం కూడా ఉంది.

కేటీఆర్ పై నమ్మకం లేక కేసీఆర్ జోక్యం
బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోందికానీ అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారమే హైలైట్ అవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ చేసిన అరాచకాలు, కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్స్ వంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అప్పటివరకు తమ పార్టీ, తమ తెలంగాణ పార్టీ అనుకున్న ప్రజలంతా ఈ ఇద్దరు నేతలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రచార సరళి చూస్తే మొగ్గు కాంగ్రెస్ వైపే కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సునీత బలహీనమైన అభ్యర్థి కావడంతో అన్నీ కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. హరీష్ రావు పట్టించుకోవడంలేదు. కేటీఆర్ పై నమ్మకం లేక మధ్యలో ఓసారి కేసీఆర్ నేతలందరినీ తన ఫామ్ హౌస్ కే పిలిపించుకొని సూచనలిచ్చారు కానీ ఆయన మాత్రం క్షేత్ర స్థాయిలోకి రాలేదు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉన్న రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే కేటీఆర్.. కేసీఆర్ తో నాన్నా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్లే గెలిచేటట్లు ఉన్నారుగా అని అయ్యా, కొడుకులిద్దరూ మాట్లాడుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications