వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహిత్ ఆత్మహత్య: మోడీ క్షమాపణ చెప్పాలన్న కేజ్రీవాల్ (ట్వీట్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియూ)లో పిహెచ్‌డి స్కాలర్ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

<strong>వర్శిటీలోనే ఉంటానని రోహిత్ తల్లి: పరిశోధక విద్యార్థి సూసైడ్ నోట్ ఇదీ..</strong>వర్శిటీలోనే ఉంటానని రోహిత్ తల్లి: పరిశోధక విద్యార్థి సూసైడ్ నోట్ ఇదీ..

తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రధాని మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘‘ఇది ఆత్మహత్య కాదు, హత్య. ప్రజాస్వామ్యం, సాంఘిక న్యాయం, సమానత్వాలను హత్య చేశారు. మంత్రులను మోడీజీ తొలగించాలి, జాతికి క్షమాపణ చెప్పాలి'' అని పేర్కొన్నారు.

Dalit scholar suicide: Kejriwal says 'it's not suicide, it's murder'; demands apology from PM Modi

<strong>సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయలేదంటే..: రోహిత్ ఆత్మహత్యపై వైస్ ఛాన్స్‌లర్ </strong>సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయలేదంటే..: రోహిత్ ఆత్మహత్యపై వైస్ ఛాన్స్‌లర్

అంతేకాదు దళితులను అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ విధి మోడీ ప్రభుత్వానికి ఉందని, ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి బదులు ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ స్కాలర్ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

<strong>దత్తాత్రేయకు రోహిత్ ఆత్మహత్య చిక్కులు: కవిత పోస్టర్‌తో ఇంటి ముట్టడి </strong>దత్తాత్రేయకు రోహిత్ ఆత్మహత్య చిక్కులు: కవిత పోస్టర్‌తో ఇంటి ముట్టడి

English summary
The dead student, Rohith Vemula, was among the five research scholars suspended by Hyderabad Central University (HCU) and also one of the accused in the case of assault on a student leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X