దళితబంధు అమలు చేయాల్సిందే, బండి సంజయ్ అల్టిమేటం
హుజురాబాద్‌లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఆ పార్టీ నేతలు మంచి జోష్‌లో ఉన్నారు. హుజురాబాద్ గెలుపు.. ప్రజల గెలుపు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈటల రాజేందర్ పై ఎన్ని కుట్రలు చేసినా చివరికి తామే గెలిచామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ పేరుతో తప్పించుకున్నారని, దళిత బంధు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నిగ్ ఇచ్చారు

సపోర్ట్ చేస్తాం
దళిత బంధు అమలు చేస్తామంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు కూడా దళిత బంధు లాంటి పథకం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ గురువారం నుంచే హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని తిరిగి ప్రారంభించాలని బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఉప ఎన్నికలో వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు టీఆర్‌ఎస్ పతనానికి నాంది అని హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ వాటిని కేంద్రంపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తోందని, వరిసాగుపై రాష్ట్ర రైంతాంగాన్ని అయోమయానికి గురి చేస్తోందని బండి సంజయ్ విమర్నించారు.

నిధులు
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది. అయితే పథకంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం మొండిగా వెళుతుంది. ఇటు మరోవైపు దళిత బంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులను విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కోసం నిధులను ఈ మంజూరు చేసింది. కానీ ఉప ఎన్నిక వల్ల ఈసీ బ్రేక్ వేసింది. ఇప్పుడు అమలు చేయాలని బండి సంజయ్ కోరుతున్నారు. ఓడిపోయామని ఆపొద్దని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ అంశాలు
దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలుంటాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది.

రక్షణ కవచం
దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు.

1200 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు. అందుకోసం అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు.

వాసాలమర్రిలో
ఇటు యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బందు పథకం ప్రారంభించారు. దీనిని సంబంధించి ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది. వాసాలమర్రిలో అర్హులైన 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేశారు. వాసాలమర్రి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమఅయ్యింది.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications