కేసీఆర్ గొప్ప నాయకుడే కానీ..: కేటీఆర్‌కు దానం నాగేందర్ సవాల్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంలు కురిపించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కేసీఆర్ గొప్ప నాయకుడని ప్రశంసించారు. అయితే, ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్‌ను భ్రష్టు పట్టించారని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు.
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్తానని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. తన అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే.. తాను కూడా న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని పేర్కొన్నారు. వాళ్లు చేసింది కరక్ట్ అయితే.. ఇప్పుడు జరుగుతున్నది కూడా కరక్టేనని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు దానం. మూడు నెలల్లో ముఖ్యమంత్రి రూ. 3500 కోట్లు సంపాదిస్తే.. పదేళ్లలో బీఆర్ఎస్ వాళ్లు ఎన్ని సంపాదించి ఉండొచ్చని దానం ప్రశ్నించారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడబెట్టినట్లు చూపిస్తే అంతా వదులుకునేందుకు సిద్ధమని దానం నాగేందర్ సవాల్ చేశారు. టీఆర్ఎస్‌లో ఓ కార్యకర్తగానే పనిచేస్తూ ఎంపీగా పోటీకి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో తనదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతలతో దానం నాగేందర్ గట్టి పోటీనే ఎదుర్కోనున్నారు.












Click it and Unblock the Notifications