వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేశా, పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వలేదు: దానం నాగేందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడికి, తదితరులకు పంపించారు. నైతిక బాధ్యత వహించి తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. పార్టీ మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.

తనకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించపోయినప్పటికీ బాధ్యతగా భావించి రాజీనామా చేశానని, రాజకీయాల్లో నైతిక బాధ్యత ముఖ్యమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ గ్రేటర్ హైదరాబాదులోని 150 స్థానాల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికల్లో కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని ఆయన చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా తన బాధ్యతలు నెరవేరుస్తానని చెప్పారు.

Danam Nagender to resign for party post

తెరాస ఇచ్చిన హామీలను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తనకు పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వలేదని ఆయన చెప్పారు. టీమ్ వర్క్‌లో తాము విఫలమయ్యామని, ఓ నాయకుడు పూర్తి బాధ్యతలు తీసుకున్నారని, అన్ని వర్గాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేశారని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రి కెటిఆర్ సమన్వయం సాధించడంలో విజయం సాధించారని ఆయన చెప్పారు.

ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదును విశ్వనగరంగా చేస్తామనే తెరాస హామీ బాగా పనిచేసిందని ఆయన చెప్పారు. తనకు పూర్తి బాధ్యతలు ఇవ్వకపోయినా పార్టీ విజయం కోసం పూర్తి స్థాయిలో పనిచేశానని చెప్పారు. పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తే తప్ప ఫలితం ఉండదని ఆయన చెప్పారు. తమ పార్టీకి బడుగు బలహీనవర్గాలు, మైనారిటీ వర్గాలు దూరమయ్యారని ఆయన చెప్పారు. మనోధైర్యాలు కోల్పోవద్దని ఆయన కార్యకర్తలను కోరారు.

తన రాజీనామా గురించి ప్రకటన చేయడానికి ముందు దానం నాగేందర్ ఇప్పటికే తన అనుచరులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడ్డారు. అయితే, తెరాస నుంచి తగిన హామీ రాకపోవడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెసు అధిష్టానం జోక్యం చేసుకుని ఆయన చేత రాజీనామాను ఉపసంహరింపజేసింది.

English summary
It is said that ex minister Danam Nagender may resign as Congress greater Hyderabad president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X