పగటిపూటే చీకటి.!నగరంలో కమ్ముకున్న మబ్బులు.!తెల్లవారు నుంచే జల్లులు.!తుపాను ప్రభావం.!
హైదరాబాద్ : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద కూడా ప్రభావం చూపిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడమే కాకుండా నగరంలో చిరు జల్లులు కురిసాయి. ఇక శనివారం తెల్లవారు ఝామునుంచే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పగటిపూటే చీకటిని తలపిస్తోంది. తెల్లవారు ఝాము నుంచే నగరం తడిసి ముద్దవుతోంది.

తుపాను ప్రభావం..
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ పలుప్రాంతాల్లో వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులంబ గద్వాల్ జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కారణం లేకుండా ప్రజలెవ్వరూ దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు ముందస్తు సూచనలు చేస్తున్నారు.

తెల్లవారు ఝామునుండే నగరంలో వర్షం..
తుపాను ప్రభావంతో శనివారం హైదరాబాద్ లో కురిసిన వానతో నగరం తడిసి ముద్దయింది. తెల్లవారు ఝామునుంచే ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తుండడంతో నగర వాసులు ఇబ్బందులకు గురయ్యారు. కార్యాలయాలకు వెళ్లేవారు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు కాస్త ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తోంది. నగరంలో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్టు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు జిల్లాల్లో తప్ప రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది.

పగటిపూటే చీకటి
హైదరాబాద్ నగరంలో చెదురు మొదురుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడ్డట్టు తెలుస్తోంది. ఉదమం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సమస్యలు తలెత్తినట్టు, మరికొన్ని చోట్ల ట్రాన్స్ ఫార్మర్లులలో సాంకేతిక సమస్యలు తలత్తినట్టు విద్యత్ ఉన్నతాదికారులు స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలం తలెత్తినంత తీవ్రస్థాయిలో కాకుండ సాధారణ సమస్యల తలెత్తాయని, అందుకు తగ్గ సిబ్బందిని రంగంలోకి దించినట్టు అధికారులు వివరిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
తెల్లవారు ఝామునుంచి కురస్తున్న వర్షానికి హైదరాబాద్లోని కొన్ని కాలనీలలో జనం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎల్బీనగర్, ఖైరతాబాద్, బోడుప్పల్, నాగోల్లోని పలు కాలనీల్లోని ప్రజలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. హైటెక్ సిటీ, సికింద్రాబాద్, మాదాపూర్, బంజారాహిల్స్, టోలిచౌకి, అత్తాపూర్ లాంటి ప్రధాన ప్రాంతాల్లోని ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తులు తీసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు మరో రెండు రోజులు అలర్ట్గా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.












Click it and Unblock the Notifications