డేటా చోరీ కేసు: నిందితుడి ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది వివరాలు, కోటి మంది హైదరాబాదీలవీ!

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డేటా చోరీ కేసులో మరో నిందితుడిని సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ఆ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలు, ఇతర వ్యక్తులు, విద్యార్థుల డేటాను కూడా నిందితుడు విక్రయిస్తున్టన్లు పోలీసులు తెలిపారు.

 Data theft case: 66.9 crore people data in accused vinays laptop.

inspirewebz వెబ్‌సైట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారానే చోరీ చేసిన డేటాను అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జీఎస్టీ, పాన్ కార్డ్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టా‌గ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్స్ సంస్థల నుంచి, బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్ సిటీల నుంచి వినయ్ భరద్వాజ డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మొత్తం 66 కోట్ల మంది డేటా చోరీకి గురవ్వగా.. ఇందులో హైదరాబాదీలకు చెందిన కోటి మంది డేటా చోరీ అయ్యింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కోట్ల 50 లక్షల మంది డేటా.. మహారాష్ట్రకు చెందిన నాలుగు కోట్ల మంది డేటా చోరీ అయ్యిందని పోలీసులు గుర్తించారు.

సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దర్యాప్తులో భాగమయ్యాయి. ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులుగా ఉన్నారు. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ అయినట్లుగా గుర్తించారు. ఇప్పటికే పలు సంస్థలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+