భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యానోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి సంవత్సరం భద్రాచలంలో గోదావరి నదీ తీరంలో జరిగే ఇక్ష్వాకు వంశ తిలకుడు, రఘుకుల సోముడైన భద్రాద్రి రాముడి వివాహ మహోత్సవాన్ని వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వార్షిక షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది.
2025లో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాములవారి వార్షిక కళ్యాణం జరుపనున్నారు. ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాధివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, 5న ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జానకీరాముల కళ్యాణం, రాత్రి చంద్రప్రభ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తీరువీధి సేవ ఉంటుంది. ఏప్రిల్ 7వ సంవత్సరానికి మహా పట్టాభిషేకం

నిర్వహిస్తారు.
మరోవైపు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రాద్రి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఆ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. భక్తుల సంఖ్య ఆధారంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆ సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా వివరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా, భద్రాద్రి స్పెషల్ దర్శననాన్ని కూడా పునరుద్దరించారు.
ఇది ఇలావుండగా, భద్రాచలం ఆలయ 2025 సంవత్సరం క్యాలెండర్‌ను రామాలయం ఈవో రమాదేవి, ప్రధానార్చకుడు విజయరాఘవన్ ఆలయ ప్రాంగణంలో గురువారం ఆవిష్కరించారు. ఈ ఏడాది 10వేల క్యాలెండర్లను ముద్రించారు. ఒక్కోదాని ధర రూ.120 అని పేర్కొన్నారు. కాగా, ఈ క్యాలెండర్.. పండుగలతో పాటు రామాలయంలో విశేషంగా నిర్వహించే ఉత్సవాలు, స్వామివారి వేడుకల చిత్రాలు, అనుబంధ కోవెలలోని విగ్రహాల చిత్రాలతో రూపొందించారు. అంతేగాక, రూ.75 ధరతో రామాయల డైరీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications