రాజయ్య సస్పెన్షన్‌పై డైలమా: సిబిఐతో దర్యాఫ్తుకు డిమాండ్, కీలక ఆధారాలు!
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య... కోడలు సారిక, మనవళ్ల అనుమానాస్పద మృతి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? వద్దా? అనే విషయమై నేతల్లో చర్చ సాగుతోంది.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజయ్యను సస్పెండ్ చేస్తే ఆయన వర్గం ఓట్ల మాటేమిటి? లేదంటే మహిళా ఓటర్లు ఏం చేస్తారు? అనే లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. సస్పెన్షన్ చేయాలని కొందరు నేతలు భావిస్తుండగా, చేయవద్దని మరికొందరు నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.
రాజయ్య ఉదంతంలో పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ.. ఉపఎన్నికల పైన ప్రభావం పడనుందని భావిస్తున్నారు. దీంతో, రాజయ్య పైన వేటు వేస్తే మంచిదా లేకుంటే వేయకుంటే మంచిదా అని చర్చించుకుంటున్నారు.
Photos: రాజయ్య కోడలు మృతి
రాజయ్య పైన వేటు వేస్తే అతనిని దోషిగా నిర్ధారించినట్లు అవుతుందని, అప్పుడు కూడా పార్టీకే నష్టమని కొందరు నేతలు చెబుతుండగా, ఆరోపణలు వచ్చినందున సస్పెన్షన్ వేటు వేయాలని, తద్వారా ఉప ఎన్నికల్లో మంచి సంకేతాలు పంపించినట్లవుతుందని ఇంకొందరు చెబుతున్నారు. రాజయ్యను దూరం చేసుకుంటే ఆయన వర్గం ఓట్లు, లేకుంటే మహిళా ఓట్లు దూరం కావొచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజయ్య ఇంట్లో ఆహార పదార్థాలు సీజ్
రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మత్తుమందు ఇచ్చి వీరిని హత్యచేసి కాల్చివేశారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. గురువారం రాజయ్య ఇంట్లో ఆహార పదార్థాలను సీజ్ చేశారు. సంఘటన స్థలం నుంచి తినుబండారాలు, రెండు గ్యాస్ సిలిండర్లు, హెయిర్ పిన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గ్యాస్ వ్యాపించి మంటలు చెలరేగడంతో వీరు మరణించి ఉంటారన్న అనుమానాలు మొదట వినిపించాయి. రాజయ్య కోడలు సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై హత్యానేరం కూడా పోలీసులు నమోదు చేశారు. రాజయ్య దంపతులను, ఆయన కొడుకు అనిల్‌ను పోలీస్ స్టేషన్‌లోనే విచారిస్తున్నారు.
వరంగల్లోనే అంత్యక్రియలు
సారిక, చిన్నారుల మృతదేహాలకు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సారిక, ఆమె ముగ్గురు కుమారులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వరంగల్‌లోని పాతనగర్ శ్మశానవాటికలో ఆమె బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వీరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వరంగల్ లయన్స్ క్లబ్ కూడా ముందుకొచ్చింది. కాగా, కేసులో పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలే కీలకమని పోలీసులు చెబుతున్నారు. కేసును సిబిఐచే దర్యాఫ్తు జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీజ్ చేసిన ఆహారపదార్థాలు కూడా కీలక ఆధారమంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications