మెట్రో పిల్లర్‌ను ఢీకొని మరో యాక్సిడెంట్: డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌ : నగరంలో మెట్రో పిల్లర్ ను ఢీకొని ప్రమాదానికి గురైన ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఘటనలో డీసీఎం డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందగా.. ప్రమాద సమయంలో వాహనం ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం.

DCM Accident

ఎల్బీనగర్‌ పరిధిలోని డీమార్ట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్ ను డీసీఎం వ్యాను వేగంగా ఢీకొట్టడంతో.. డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతున్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఎస్‌.కె. సర్దార్‌గా గుర్తించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వంటచెరుకు లోడ్‌తో వస్తున్న డీసీఎం.. ఎల్బీనగర్ డీమార్ట్ వద్ద నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A dcm van met with accident in lb nagar circle. After hitting the metro rail pillar, driver Sardhar was died on the spot
Please Wait while comments are loading...