Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డీఎస్‌కు ప్రాణహాని: ఎంపీ ధర్మపురి అరవింద్‌పై సంజయ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆయన కుమారుడు డీ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్‌పై కుట్ర జరుగుతోందని.. ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై తనకు అనుమానం ఉందని అన్నారు.

'మా నాన్నను నిజామాబాద్ ఎంపీ అరవింద్ బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారు. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారు. డీఎస్ రాజీనామా చేసిన సంతకం కూడా ఫేక్' అని ధర్మపురి సంజయ్ చెప్పుకొచ్చారు. డీఎస్‌ను గదిలో బంధించి సంతకం చేయించారని ఆరోపించారు. తన తండ్రి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Death threat to D srinivas: Dharmapuri Sanjay sensational comments on his brother and MP D arvind

నిజామాబాద్ జనం అంతా గమనిస్తున్నారని.. తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు రాయించుకున్నారని సంజయ్ ఆరోపించారు. దీని వెనుక ఎంపీ అరవింద్ ఉన్నారని అన్నారు. తమ తల్లికి రాజకీయాలు తెలియవన్నారు. తను తమ్ముడు అరవింద్ మాటలు నమ్ముతుందన్నారు.

మరోవైపు, తన తండ్రితో లైవ్‌లో ఫోన్ మాట్లాడారు సంజయ్. ఈ సందర్భంగా తనకు ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు కానీ.. రాజీనామా చేసేవరకు తనను హెరాస్‌ చేసినట్లు ఫోన్ కాల్‌లో చెప్పారు డీఎస్. దీంతో డీఎస్‌కు ధైర్యం చెప్పారు సంజయ్. కొన్ని వందల ఫ్యామిలీలు మనకు అండగా ఉన్నాయని డీఎస్‌తో చెప్పారు. "మీరో లెజెండ్. ధైర్యంగా ఉండండి డాడీ. ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. వేల మంది ఇంటికి వస్తారు. నువ్వు సంపాదించిన పెద్ద సైన్యం నీతో ఉంది. ఒక్క సెకన్ కూడా భయపడాల్సిన అవసరం లేదు' అంటూ డీఎస్‌తో ఫోన్‌లో మాట్లాడారు ధర్మపురి సంజయ్. ఇక నువ్వు నవ్వితే ఫోన్ కట్ చేస్తానని సంజయ్ చెప్పగా.. డీఎస్ పెద్దగా నవ్వడం వినిపించింది.

అంతకుముందు, తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలను ధర్మపురి శ్రీనివాస్‌ ఖండించారు. తనను వివాదాల్లోకి లాగొద్దని స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ కూడా రాశారు. ఆదివారం నా కుమారుడు డి సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారని.. సంజయ్‌తోపాటు తాను కూడా గాంధీ భవన్‌కు వెళ్లినట్లుగా తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారు తనకు కూడా కండువా కప్పి పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేశారని.. ఒకవేళ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు భావిస్తే.. ఇదే లేఖను రాజీనామాగా తీసుకోవాలన్నారు డీఎస్‌. వయసురీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు లేఖలో తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఎవరూ తమ ఇంటికి రావద్దని డీఎస్ సతీమణి ఓ వీడియోను విడుదల చేశారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.

ధర్మపురి అరవింద్ ఏమన్నారంటే..?

తన తండ్రి డీఎస్ ఎపిసోడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. తన తండ్రి పక్కా కాంగ్రెస్ వాది అని.. తాను పక్కా బీజేపీ వాదినని స్పష్టం చేశారు. 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతానని తన తండ్రి డీఎస్ చెబుతున్నా.. ఎందుకు చేర్చుకోలేదని ఆయన ప్రశ్నించారు. తన తండ్రి డీఎస్ మాట్లాడలేదని, మాట్లాడినా గుర్తుండని, నడవలేని పరిస్థితిలో ఉంటే పార్టీలో చేర్పించుకోవడం సరియైనది కాదని అరవింద్ అన్నారు.

డీఎస్ హెల్త్ బులిటెన్

డీఎస్ ఆరోగ్యంగాపై ఆయన చికిత్స పొందుతున్న సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న డీఎస్ కు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ జరిగింది. ఈ మేరకు ఒత్తిడి, ప్రయాణాలకు, రద్దీ ప్రదేశాలకు, రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని.. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒత్తిడి అధికమై రాత్రి తిరిగి ఫిట్స్ కూడా వచ్చినట్లు ఆయన భార్య విజయలక్ష్మి తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త డీఎస్ తో రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

ఇది ఇలావుండగా, డీఎస్ కు రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీని కోరారు కాంగ్రెస్ నేత నిరంజన్. డీఎస్ కు కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వేధింపుల గురించి డీఎస్ స్వయంగా ప్రస్తావించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని డీఎస్ పై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఏడాదిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+