Kejriwal: మొహల్లా క్లినిక్‌లు చూసే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు: కేజ్రీవాల్
సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు. ఇవాళ రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. కంటి వెలుగు అద్బుత పథకంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు.
కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీలో కూడా అమలు చేస్తామని చెప్పారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను చూసి తెలంగాణలో బస్తీ దవాఖానాగా అమలు చేశారని గుర్తు చేశారు. మొహల్లా క్లినిక్‌ల పరిశీలనకు కేసీఆర్ ఢిల్లీలో తిరిగారని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ పాఠశాలలు పరిశీలించారని పేర్కొన్నారు. ఢిల్లీ పాఠశాల మాదిరిగా తమిళనాడులోనూ పాఠశాలలు బాగుచేసుకున్నారని కేజ్రీవాల్ చెప్పారు.

ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారని తెలిపారు. గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారని విమర్శించారు. గవర్నర్లపై ఒత్తిడి ఉందన్నారు. వచ్చే ఎన్నికలు దేశాన్ని మార్చేందుకు ప్రజలకు మంచి అవకాశమని చెప్పారు.












Click it and Unblock the Notifications