కూరుకుపోయిన కవిత: పక్కా ఎవిడెన్స్
K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.
కేజ్రీవాల్ జ్యడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆయనను రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈడీ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపించారు. మరో 10 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత్ రాష్ట్ర సమితి నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నుంచి 25 కోట్ల రూపాయలను వినోద్ చౌహాన్ అందుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అభిషేక్ బోయిన్‌పల్లి ద్వారా కవిత పీఏ ఈ మొత్తాన్ని హవాలా రాకెట్ రూపంలో బదలాయించినట్లు వివరించారు.
ఈ కేసులో మే నెలలో వినోద్ చౌహాన్‌ను అరెస్ట్ చేశామని, వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్, వినోద్ చౌహాన్‌కు బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
వాదోపవాదాలను ఆలకించిన అనంతరం రోస్ అవెన్యూ న్యాయస్థానం.. కేజ్రీవాల్, వినోద్ చౌహాన్ జ్యుడీషియల్ కస్టడీని జులై 3వ తేదీ వరకు పొడిగించింది. ఇదే కేసులో కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కూడా ఈడీ, సీబీఐ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. కవిత కస్టడీని కూడా రోస్ అవెన్యూ కోర్టు జులై 3వ తేదీ వరకు గతంలోనే పొడిగించింది.
బెయిల్ కోసం గతంలో అరవింద్ కేజ్రీవాల్, కవిత చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదల అయ్యారు. గడువు ముగిసిన వెంటనే మళ్లీ తీహార్ జైలులో లొంగిపోయారు. వినోద్ చౌహాన్‌కు కల్వకుంట్ల కవిత 25 కోట్ల రూపాయలను బదలాయించినట్లు తాజాగా నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో కవిత మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications