ఢిల్లీ లిక్కర్ స్కామ్: కీలకంగా అభిషేక్‌రావు సీబీఐ కస్టడీ; విచారణలో ఎవరిపేర్లు బయటకు వస్తాయో!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అభిషేక్ రావును సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, నిన్నటి నుండి కొనసాగుతున్న బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ కీలకంగా మారింది.

 మూడు రోజుల సిబిఐ కస్టడీకి బోయినపల్లి అభిషేక్ రావు

మూడు రోజుల సిబిఐ కస్టడీకి బోయినపల్లి అభిషేక్ రావు

బోయినపల్లి అభిషేక్ రావును తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అధికారులు వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు అభిషేక్ రావును 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న విచారణలో భాగంగా అభిషేక్ రావు ఖాతాలో 3.85 కోట్ల మేర నిధులు వచ్చాయని గుర్తించామని చెప్పిన సిబిఐ అధికారులు ఆ నిధులను అభిషేక్ వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. నిధులకు సంబంధించిన వివరాలపై సరైన సమాధానం చెప్పలేదని కోర్టుకు తెలిపిన సిబిఐ అధికారులు పూర్తి వివరాలు రాబట్టడం కోసం, తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు తెలిపారు. ఇక సిబిఐ అధికారుల వాదనతో ఏకీభవించిన కోర్టు అభిషేక్ రావును సిబిఐ కస్టడీకి అనుమతించింది.

 ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా మారిన బోయినపల్లి అభిషేక్ రావు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా మారిన బోయినపల్లి అభిషేక్ రావు

దీంతో నిన్నటి నుండి సీబీఐ కస్టడీలో ఉన్న బోయినపల్లి అభిషేక్ రావు ఏం చెబుతారో అన్న ఆసక్తి తెలంగాణ రాజకీయవర్గాలలో కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారీగా ముడుపులు చేతులు మారిన వ్యవహారంలో అభిషేక్ రావు కీలకంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు, ఈ వ్యవహారంలో వ్యాపార, రాజకీయ ప్రముఖుల పాత్రపై ఆరా తీస్తున్నారు. అభిషేక్ రావును విచారించి కీలక సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు సిబిఐ అధికారులు.

 అభిషేక్ రావు కు సంబంధించిన వ్యాపార లావాదేవీలపై కొనసాగుతున్న దర్యాప్తు

అభిషేక్ రావు కు సంబంధించిన వ్యాపార లావాదేవీలపై కొనసాగుతున్న దర్యాప్తు

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో అభిషేక్ రావు కీలకంగా వ్యవహరించారని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తుంది. అభిషేక్ రావు కు సంబంధించి వ్యాపార లావాదేవీలు, ఎక్కడ ఎక్కడ నుండి ఆయనకు నగదు బదిలీ జరిగింది వంటి అనేక విషయాలను సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అరుణ్ రామచంద్రన్ పిళ్ళై పై సీబీఐ కేసు నమోదు చేశారు. ఇక రామచంద్రన్ పిళ్ళై రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కి సంబంధించి ఎల్ఎల్ సి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న అభిషేక్ రావుపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.

 అభిషేక్ రావుకు సి.బి.ఐ ప్రశ్నల వర్షం.. వారితో సంబంధాలపై ఆరా

అభిషేక్ రావుకు సి.బి.ఐ ప్రశ్నల వర్షం.. వారితో సంబంధాలపై ఆరా

రాబిన్ డిస్టిలరీస్ కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, భాగస్వాముల వివరాలపై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. హవాలా మార్గంలో భారీగా నగదు చేతులు మారినట్టు గుర్తించిన సి.బి.ఐ, దీని ద్వారా అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తుల వివరాలను సేకరిస్తోంది. అనేక కీలక డాక్యుమెంట్లను ముందుంచి బోయినపల్లి అభిషేక్ రావును సిబిఐ ప్రశ్నిస్తోంది. సిబిఐ విచారణలో ఆయన ఎవరి పేరు బయటపెడతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మనీష్ సిసోడియా అనుచరుడు అర్జున్ పాండే, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు లతో కూడా అభిషేక్ రావు సంబంధాలపై మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+