CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ కు నోటీసులు జారీ చేయడంపై కలకలం రేగింది. ఫేక్ వీడియోకు సంబంధించి రేవంత్ కు నోటిసులు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో కేసులో రేవంత్ కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే1 లోగా వివరణ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీపీసీసీ ట్విట్టర్ హ్యాండిల్ అమిత్ షా కు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు గా ఉంది.
అయితే అమిత్ షా అలా అనలేదని.. బీజేపీ, హోంశాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రానికి చెందిన మరో నలుగురు నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని బీజేపీ ఆరోపించింది. ఎడిట్ చేసిన వీడియోల షెడ్యూల్డ్ కులాలు(SC), షెడ్యూల్డ్ తెగలు(ST), వెనకబడి తరగతులు(OBC) రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా వీడియో ఉందని బీజేపీ పేర్కొంది.

అమిత్ షా అలా అనలేదని తెలిపింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విరించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 153A, 465, 469, 171G, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద కేసు నమోదు చేశారు. వీడియోను అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు ఎక్స్, ఫేస్ బుక్ కు నోటీసులు కూడా పంపారు.
.@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024
Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3
"కాంగ్రెస్ ఎడిట్ చేసిన వీడియోను పూర్తిగా ఫేక్. పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉంది. హోం మంత్రి అమిత్ షా ఎస్సీల వాటాను తగ్గించిన తర్వాత, మతం ఆధారంగా ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించడం గురించి మాట్లాడారు" అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా అన్నారు.నకిలీ వీడియోను పలువురు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పోస్ట్ చేశారని మాల్వియా పేర్కొన్నారు.
-
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications