హస్తంలో రేవంత్ హవా: రాహుల్‌తో లంచ్.. సోనియానూ కలిసేందుకు!, ఇదీ షెడ్యూల్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నిన్న మొన్నటిదాకా టీటీడీపీ ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రేవంత్ ఇక కాంగ్రెస్ తరుపున తన మాటల తూటాలు పేల్చబోతున్నారు. పార్టీ మార్పు లీకులిచ్చిన వారం, పదిరోజుల్లోనే కాంగ్రెస్‌లో ఆయన చేరిక ఖాయమైపోయింది.

  రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేది వీళ్లే! : Full List | Oneindia Telugu

  ఢిల్లీకి చేరిన రేవంత్, అనుచరుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు, హుటాహుటిన సీతక్క

  అనుచరులను వెంటపెట్టుకుని ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఆయన.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గం.కు రేవంత్ రాహుల్ గాంధీని కలుసుకునే అవకాశముంది.

   సోనియా ఆశీర్వచనం కోసం:

  సోనియా ఆశీర్వచనం కోసం:

  కుదిరితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా రేవంత్ కలిసే అవకాశముంది. పార్టీ మారుతున్న వేళ.. సోనియా ఆశీర్వచనాలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రసాదించిన తల్లిగా కాంగ్రెస్ నేతలు కొనియాడే సోనియాను ప్రసన్నం చేసుకోవడం ద్వారా పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకోవాలనుకుంటున్నారు.

   షెడ్యూల్ ఇదే:

  షెడ్యూల్ ఇదే:

  ఈ మధ్యాహ్నాం రాహుల్ తో భేటీ సందర్భంగా.. ఆయనతోనే లంచ్ చేయనున్నారు రేవంత్. దాదాపు గంట సేపు ఆయనతోనే గడపనున్నారు. భేటీ అనంతరం సాయంత్రం 4గం.కు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాహుల్ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అనంతరం రాత్రికి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

   రాహుల్ నుంచి హామి పొందాలని:

  రాహుల్ నుంచి హామి పొందాలని:

  రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతుండటం రేవంత్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మధ్యాహ్నాం భేటీలో తన ప్రతిపాదనలకు రాహుల్ నుంచి స్పష్టమైన హామి పొందాలని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోకి తన వెంట వస్తున్న నేతలందరికీ టికెట్లు ఇప్పించుకోవడం పైనే ఆయన ఫోకస్ పెట్టనున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో సొంత గ్రూపును మెయింటెన్ చేయాలనుకుంటున్నారు.

   రేవంత్ హవా:

  రేవంత్ హవా:

  రేవంత్ హవా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఆయన సెంటరాఫ్ ది ఎట్రాక్షన్ గా మారిపోయినట్టు కనిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే.. మున్ముందు సీనియర్లకు చెక్ పెట్టి.. తానే ముందు వరుసలోకి రావడం ఆయనకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యం కాబట్టి.. రేవంత్ దూకుడుకు బ్రేక్ వేయకపోవచ్చు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy appointment was fixed with AICC Vice President Rahul Gandhi on Tuesday afternoon, its about his schedule in Delhi

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి