తెలంగాణాలో డెంగ్యూ పంజా: దేశంలో 10వ స్థానంలో; ఇప్పటివరకు ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసును తీవ్రంగా నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నమోదైన కేసులు రాష్ట్ర ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ భయం, మరోపక్క కోవిడెంగ్యూ కేసులతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పరేషాన్ చేస్తోంది.

తెలంగాణా రాష్ట్రంలో చాప క్రింద నీరులా డెంగ్యూ
తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన డెంగ్యూ కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. దేశం లేని డెంగ్యూ కేసులలో తెలంగాణ రాష్ట్రం పదవ స్థానానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడు రెట్లు అధికంగా తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

గత ఏడాది కేసులతో పోలిస్తే మూడు రెట్లు కేసులు అధికం
గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో 2,173 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ 21 నాటికి 6284 డెంగ్యూ కేసు నమోదైనట్లు గా గణాంకాలు చెబుతున్నాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య ఎంతగా పెరిగిందో ఈ లెక్కల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక దేశవ్యాప్తంగా గతేడాది డెంగ్యూ కేసులు 44,585 కేసు నమోదు కాగా, 66 మంది డెంగ్యూ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 1,64,103 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 146 మంది డెంగ్యూ కారణంగా ప్రాణాలను కోల్పోయారు.

6 వేలకు పైగా తెలంగాణా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు
ప్రధానంగా డెంగ్యూ కేసులు వర్షాకాలంలో దోమల వల్ల ఎక్కువగా నమోదు అవుతాయి. జనవరి నుండి జూన్ 10 వరకు, తెలంగాణ రాష్ట్రంలో 265 మంది డెంగ్యూ తో బాధపడగా, జూన్ 11 నుండి నవంబర్ 21 వరకు దాదాపు 6,284మందికి డెంగ్యూ వైరస్ సోకింది. జూన్‌లో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసులు విపరీతంగా పెరిగాయి.దోమలు వృద్ధి చెందడానికి మరియు డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందడానికి అనువైన పరిస్థితులు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, ఎక్కువగా నిలిచిపోయిన మురుగునీరు, భారీ సంఖ్యలో ప్రజలు ఒకే చోట నివసిస్తూ ఉండటం, అపరిశుభ్ర పరిసరాలు అని తెలుస్తుంది.

పెరుగుతున్న డెంగ్యూ కేసులతో ప్రభుత్వం అలెర్ట్
20 కంటే తక్కువ లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు దోమలు పెరగడానికి అనువైనవి కాదని సమాచారం. అయితే వర్షాకాలం పోయి శీతాకాలం రావడంతో ప్రస్తుతం డెంగ్యూ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తుంది. ఏదిఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల పెరుగుదల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణా అధికార యంత్రాంగం, డెంగ్యూ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తగిన వైద్య సేవలను అందిస్తుంది.

డెంగ్యూ కేసుల తీవ్రత తగ్గుతుందని అంచనా.. అన్ని ఆస్పత్రులలోనూ వైద్యం
ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో డెంగ్యూ కేసుల సంఖ్య, కేసుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలంగాణా సర్కార్ భావిస్తుంది. ఢి అన్ని ఆసుపత్రులలోనూ డెంగ్యూ రోగులకోసం కావలసిన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసి మరీ చికిత్స అందిస్తున్నారు. అలాగే డెంగ్యూతో వచ్చిన ఏ ఒక్క రోగిని ట్రీట్మెంట్ చేయకుండా వెనక్కి పంపే పరిస్థితి రాబోదని ఆయన తేల్చి చెప్పారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications