బ్యాంకుల్లో తగ్గుతున్న జమలు: రూ.2వేల నోట్లు దొరకడం కష్టంగా మారింది
హైదరాబాద్: ఇటీవలి కాలంలో రూ.2000 వేల నోట్లు ఎక్కువగా దొరకడం లేదు. గత కొన్ని నెలలుగా ఈ నోట్లను జమ చేసి వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని, దీంతో పెద్ద నోట్లు రావడం లేదని తెలుస్తోంది.
దీంతో బ్యాంకుల్లోను కొంత నగదు కొరత కనిపిస్తోంది. బ్యాంకులకు సెలవులు వస్తే ఏటీఎంలు పని చేయడం లేకపోవడం లేదా డబ్బులు అయిపోవడం కనిపిస్తోంది.
బ్యాంకుల్లో నగదు నిల్వలపై నిఘా పెరిగిన అనంతరం ఎఫ్ఆర్డీఐ బిల్లు వచ్చాక బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు పెరుగుతున్నాయి.

ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులలో నగదు డిపాజిట్లు జరిగినప్పుడు ఎక్కువగా రూ.2వేల నోట్లు ఉండేవని, ఇప్పుడు అలా సగానికి సగం పడిపోయిందని తెలుస్తోంది.
దీంతో బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలకు నగదు కొరత ఉంటోందని అంటున్నారు. నగరాలతో పాటు జిల్లా, మండల, గ్రామీణ బ్యాంకుల్లోను నగదు కొరత ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications