Telangana Assembly Elections 2023: ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోనే అధికారం లేదు..!
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేయటానికి కొత్త ప్రింటింగ్ మెషీన్లు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఈవో సత్యవాణి తెలిపారు. శుక్రవారం ఆమె సమీక్షాసమావేశంలో పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ముందుగానే ప్రింటింగ్ మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికలకు కొత్తగ 299 పోలింగ్ స్టేషన్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య పెరగడంతోనే పోలింగ్ కేంద్రాలు పెచ్చినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ సెంటర్ల అనుమతి కోసం ప్రపోజల్స్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు చెప్పారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను భద్రపరచటానికి స్ట్రాంగ్ రూంల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వివరించారు. అన్నీ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఏ,బీ,సీ,డీ పద్ధతిలో స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈసారి ఎన్నికల్లో 28 వేల మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. పలువురు రిటర్నింగ్ అధికారుపై ఫిర్యాదులొచ్చాయని పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని చెప్పారు. ఇక ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో మొత్తం 1400 మంది ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికల్లో అందరు తమ ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు అవసరమయ్యే వసతులను విధిగా కల్పించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నవంబర్ 30 పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications