Rythu Bharosa: రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్క..!

రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై మంత్రివర్గ సబ్ కమిటీ ప్రజల అభిప్రాయం తీసుకుంటోంది. రైతు భరోసా పై తాజాగా డిప్యూటీ సీఎం పలు వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడుతామని చెప్పారు.హనుమకొండ జిల్లాలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణలో భట్టి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, కొండా సురేఖ హాజరయ్యారు.

రైతు భరోసాపై రైతులందరి అభిప్రాయాలు తీసుకుంటామని భట్టి చెప్పారు. వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని భట్టి గుర్తు చేశారు. ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని తేల్చి చెప్పారు. ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. రైతు భరోసాపై ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Deputy CM Bhatti Vikramarka made key comments on farmer assurance

అన్నదాతలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యే నిర్ణయాలు తీసుకుందని.. కానీ తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని గౌవరవిస్తుందన్నారు. నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని విమర్శించారు.నిరుద్యోగుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. అర్హులకే రైతు రైతు భరోసా పథకం ఇస్తామని స్పష్టం చేశారు.

రైతు భరోసాపై ఇప్పటికే ఖమ్మం జిల్లాలో రైతుల అభిప్రాయం సేకరించారు. మిగతా జిల్లాల్లో కూడా మంత్రివర్గ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. పీఎం కిసాన్ యోజనకు ఉన్న నిబంధనలనే రైతు భరోసాకు అమలు చేసే అవకాశం ఉంది. అలాగే రైతు రుణ మాఫీకి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+