Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత: డిప్యూటీ సీఎం అలీని కొట్టిన మజ్లిస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మంగళవారం నాడు చివరి నిమిషంలో పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. మజ్లిస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి వాళ్ల పైన దాడులు చేసినట్లు టీవీ ఛానళ్లలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మజ్లిస్ పార్టీ నేతలు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా తెరాస నేత, ఉప ముఖ్యమంత్రి అలీ పైన కూడా మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా చేయి చేసుకున్నట్లుగా టీవీ ఛానళ్లలో వార్తలు వచ్చాయి. అలీ ఇంటి పైన మజ్లిస్ కార్యకర్తలు దాడి చేశారని అంటున్నారు.

ఈ దాడిలో మహమూద్ అలీ కొడుకు అజం అలీ గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో అజంపురలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు, మాదన్నపేటలో బిజెపి పోలింగ్ ఏజెంట్ పైన మజ్లిస్ నేత ముంతాజ్, అనుచరులు దాడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Deputy CM Mahmood Ali house attacked

పోలీసులకు ఫిర్యాదు

అజంపురలో ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై మజ్లిస్ ఎమ్మెల్యే బలాల అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, డిప్యూటీ సీఎం నివాసంపై దాడికి దిగిన వారిపై లాఠీలు ఝలిపించారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలే తమపై దాడులకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. దాడుల విషయంలో తెరాస నేతలు తమపై అభాండాలు వేస్తున్నారని మజ్లిస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే బలాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

ఖండించిన జానా రెడ్డి

మజ్లిస్ పార్టీ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి అన్నారు. మజ్లిస్ పార్టీ తీరు అప్రజాస్వామికం అన్నారు. మజ్లిస్ గూండాలతో అసద్ తమ పార్టీ నేతల కారుపై దాడి చేయించాడం దారుణమన్నారు. అసద్ స్వయంగా దాడి చేశారన్నారు.

మజ్లిస్ గూండాలను పోలీసులు కట్టడి చేయాలన్నారు. ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీలపై దాడిన ఖండిస్తున్నామన్నారు. హైదరాబాదులో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేసిన అసద్ అతని అనుచరులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై చర్యలు తీసుకోని పక్షంలో ప్రజా ఉద్యమం వచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాదులో ఇలాంటి చర్యలను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం వల్లే వారు మితిమీరి వ్యవహరిస్తున్నారన్నారు. పాతబస్తీకి వెళ్లాలంటే అసద్‌ని అడగాలా అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+