Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుర్తింపు కోసం మరోసారి కేసీఆర్ వద్దకు: ఆన్‌లైన్ మీడియా జర్నలిస్టుల నిర్ణయం

గత సంవత్సరం ఈ గైడ్ లైన్స్ ప్రకారం అక్రిడిటేషణ్స్ ఇచ్చిన ప్రభుత్వం ఈ సారి మాత్రం ఇచ్చిన జీవోలో ఆన్ లైన్ మీడియాను చేర్చకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు.

హైదరాబాద్: ఆన్‌లైన్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆన్‌లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆన్‌లైన్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (తోజు) మరియు తెలంగాణ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తోమ్జ) రెండు వీలినమయ్యి తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తొమ్వాజ) గా ఆవిర్భవించింది.

 detais of telangana online journalists union meeting at somajiguda

ఈ సందర్భంగా తోజు నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయిలు రమేష్ మాట్లాడుతూ.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలకు చేరువవుతున్న ఆన్‌లైన్ మీడియాకు తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఇతర మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇస్తున్నట్లు గానే ఆన్‌లైన్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషణ్ కార్డులను ఇవ్వాలని అన్నారు.

ఇందుకు గాను ఆన్ లైన్ మీడియా ను గుర్తించేందుకు తగిన గైడ్ లైన్స్‌ను రూపొందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ధర్మాసనం మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావును కలిసి ఆన్‌లైన్ మీడియా జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని కాని సరైన స్పందన లేదని ఆయన వివరించారు.

అయిన మరొకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈమేరకు విజ్ఞ్యప్తి చేస్తామని అప్పటికి కాని పక్షంలో పోరుబాటని ఆశ్రయిస్తామన్నారు. గతంలో ఇచ్చిన అక్రిడిటేషణ్ కార్డులను ఎందుకు ఆపివేసారని అధికారులని అడిగితే అసంబద్ద కారణాలు చూపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ మీడియాను గుర్తిస్తూ కొన్ని గైడ్ లైన్స్ ను రూపొందించిందని శ్రీధర్ చప్పారు .

గత సంవత్సరం ఈ గైడ్ లైన్స్ ప్రకారం అక్రిడిటేషణ్స్ ఇచ్చిన ప్రభుత్వం ఈ సారి మాత్రం ఇచ్చిన జీవోలో ఆన్ లైన్ మీడియాను చేర్చకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు.

యూనియన్ గౌరవధ్యక్షులైన కాసుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది ప్రభుత్వ అధికారులు ఆన్‌లైన్ మీడియాని సోషల్ మీడియాగా భావిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని.
ఆన్ లైన్ మీడియా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తరువాత మూడవ మాధ్యమంగా నేడు ఆవిర్భవించిందని తెలిపారు.
గతంలో ఇచ్చిన అక్రిడిటేషణ్ కార్డులను ఈ సంవత్సరం రద్దు చేయడం వెనకాల ఎదో రాజకీయ కుట్ర ఉందని, చిన్న పత్రికల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీనే ఆన్ లైన్ మీడియా కూడా వర్తింప చేయమని గతంలోనే కోరామని తెలిపారు.

నూతనంగా ఎన్నుకోబడ్డ ఇతర కమిటీ సభ్యులైన (వైస్ ప్రెసిడెంట్స్) మదిశెట్టి రాజగోపాల్,ఎ రాజేష్, సూర్య రావ్, ఎం ఎస్ శంకర్, అమర్ రాజ్పుటే, కే. శ్రీకాంత్ రెడ్డి (జాయింట్ సేక్రేటరీలు) కళ్యాణం శ్రీనివాస్, కే.హనుమంత్ రావు, ముద్దం నరసింహ స్వామి, రాజ్కుమార్ అల్లా, శ్యాం మోహన్, ప్రభు దాస్, (కోశాధికారి) వేముల సదానందం మరియు కార్యవర్గ సభ్యులు కే ఎల్ నరసింహ రావు, ఎస్ శంకర్ గౌడ్, శైలజ రాజ్పుటే, డి సింధూర, కే. సంతోష్ కుమార్, ఫణి ముళ్ళపూడి, డాక్టర్ రామ్ మూర్తి ఈ కార్యక్రమానికి హాజరైనారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+