Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టి సుబ్బిరామిరెడ్డి మనవడి పెళ్లికి హైదరాబాద్‌లో దేవేగౌడ, కేసీఆర్‌తో భేటీ

హైదరాబాద్: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రగతి భవన్‌లో కలుసుకున్నారు.

దేవెగౌడకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఘనస్వాగతం పలికారు. దేవెగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించారు.

 Deve Gouda in Hyderabad for T Subbarami Reddys grandson Wedding, meets TS CM KCR

కేసీఆర్‌తో భేటీ అనంతరం దేవేగౌడ నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరారు. ఈ స‌మావేశంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎంపీ సుబ్బిరామి రెడ్డి మనువడి వివాహానికి హాజరయ్యేందుకు శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో దేవేగౌడ హైదరాబాద్ వచ్చారు.

 Deve Gouda in Hyderabad for T Subbarami Reddys grandson Wedding, meets TS CM KCR

కాగా, శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన దేవేగౌడకు ఎంపీ సుబ్బిరామి రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తాను బస చేయనున్న హోటల్‌కు వెళ్లారు. ఆదివారం జరిగే సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహానికి హాజరై, ఆ తర్వాత ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అనంతరం బెంగళూరుకు వెళ్లారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+