హైదరాబాద్‌కు దేవెగౌడ: కేసీఆర్‌తో భేటీ, తాజా పరిస్థితిపై చర్చ
హైదరాబాద్: మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు.ప్రత్యేక విమానంలో భాగ్యనగరానికి చేరుకోనున్న ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు స్వాగతం పలకనున్నారు.
అక్కడి నుంచి నేరుగా ప్రగతి భనవ్‌కు వెళ్లనున్న దేవెగౌడ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాఖ్య కూటమి ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై వారిద్దరూ కీలకంగా చర్చించనున్నారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే ప్రధాన ఎజెండాగా ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో సమావేశమై చర్చించారు. అంతకుముందు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ ఆయన భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేందుకే మొగ్గుచూపుతుండటం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటకలో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications