మంత్రి కేటీఆర్ చొరవతో రోడ్ల అభివృద్ధి.! సీఆర్ఎంపీ పథకం ద్వారా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత.!

హైదరాబాద్ : ప్రయాణం సాఫిగా జరగాలంటే వాహనాలు ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా రోడ్లు ఉండాలి. రోడ్ల వలన రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆ ప్రాంత ప్రగతికి దోహదపడుతుంది. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరంలో పరిశ్రమల స్థాపన ఉద్యోగ అవకాశాలు మెరుగు పడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న వాహనాల రాకపోకల వలన ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు నగరంలో రోడ్ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 9013కిలో మీటర్ల రోడ్లను స్వయంగా పర్యవేక్షిస్తోంది. అందులో 2846 కిలో మీటర్ల బ్లాక్ టాప్ (బి.టి) రోడ్లు కాగా 6167 సిమెంట్ రోడ్లు ఉన్నాయని, ఈ రోడ్లలో 526 కిలో మీటర్ల రోడ్లు 4 లైన్లు, 8 లైన్ల రోడ్లు ఉన్నాయని నగర పాలక సంస్థ అధికారులు దృవీకరించారు.

Development of roads on the initiative of Minister KTR.!

ఈ నేపథ్యంలో 9013 కిలో మీటర్ల ప్రధాన బి.టి రోడ్లలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (CRMP) పథకం ద్వారా 709.49కిలో మీటర్ల ప్రజా రవాణా మెరుగుపడే ప్రధాన రోడ్డును 1839 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ రోడ్ల నిర్మాణం 3 లేన్ల , ఎక్కువ వెడల్పు గల రోడ్లను 7 ప్యాకేజీలో 401 స్ట్రే చేస్ 5 సంవత్సరాలు నిర్వహణ చేసే విధంగా ఏజెన్సీకి ఇవ్వడం జరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏజెన్సీ ఫుట్ పాత్, సెంట్రల్ డివైడర్లు, నిర్మాణాలు, కర్బ్ పెయింటింగ్, లైన్ మార్కింగ్, గ్రీనరి తదితర సౌకర్యాలను పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 468.663 కిలో మీటర్ల బిటి రోడ్ల నిర్మాణం చేపట్టగా 554.74కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మిగితా లక్ష్యాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తారు. రోడ్ల నిర్వహణలో బాగంగా ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించేందుకు సంబంధిత ఏజెన్సీ జోనల్ వారికి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు 15,458 గుంతలను మరమ్మత్తు చేపట్టినట్టు నగరపాలక అదికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+