యాదాద్రీశ్వరుడిని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఆలయం ఒకటి. ఇక్కడి నిత్యం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొండపై ఉన్న యాదాద్రీశ్వరుడి దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి, సుఖశాంతులతో జీవిస్థారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడికి నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక నేడు (ఆదివారం) యాదాద్రి గుట్టపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈరోజు సెలవు కావడంతో సమీపంలోని వారంతా యాదాద్రీశ్వరుడిని దర్శనం కోసం విచ్చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే క్యూ కాంప్లెక్స్‌లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి ధర్మ దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుందని అధికారులు వివరించారు.
ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. దీంతో క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు పలు ఏర్పాట్లు చేశౄరు. కొండ కింద ఆధ్యాత్మికవాడలో గల వ్రత మండపం, పుష్కరిణి, కళ్యాణకట్ట, వాహనాల పార్కింగ్ భక్తులతో రద్దీగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నారు.

యాదరుషి మండపం నిర్మాణం..
ఇదిలా ఉండగా, వచ్చే నెల 15 లోపు యాదాద్రి గుట్టపై యాదరుషి మండపాన్ని నిర్మించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వివరించారు. నిన్న (శనివారం) సంబంధిత ఆఫీసర్లతో కలిసి ఆయన యాదరుషి మండపాన్ని నిర్మించే స్థలాన్ని ఈవో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కర్‌రావు మాట్లాడుతూ యాదగిరి నారసింహుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రంలోపు (జూలై 15న స్వాతినక్షత్రం) గిరిప్రదక్షిణ చేసే మార్గంలో భక్తుల సందర్శనార్థం యాదరుషి మండపాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవని అన్నారు.












Click it and Unblock the Notifications