మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్ధను అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్తామని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. 2014 సంవత్సరానికి సంబంధించి నేరాల వివరాలను సోమవారం అనురాగ్ శర్మ మీడియాకు వివరించారు. మారుతున్న పరిస్ధితులు, టెక్నాలజీకి తగ్గట్టుగా తెలంగాణ పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తామని అన్నారు. టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుని నేరాలను అదుపు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో అధికారుల కొరత ఉన్నప్పటికీ లోటు రానీయకుండా ఉన్న అధికారులతోనే పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించామన్నారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
రాష్ట్రంలో పెద్దగా మావోయిస్టుల కదలికలు లేవన్న ఆయన ఈ ఏడాది 68 మంది మావోయిస్టులు తమంతటతాముగా లొంగిపోయారని చెప్పారు. అందులో ఇద్దరు స్పెషల్ కమిటీ సభ్యులు ఉన్నారని అన్నారు. ఉగ్రవాద గ్రూపుల పట్ల ఆకర్షిలవుతున్న వారిని ముందుగానే అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సిమికి చెందిన షా ముదస్సీర్, షోయబ్ అహ్మద్ ఖాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. సోషల్ మీడియాలో ఉగ్రవాదం పట్ల ఆకర్షితులైన నలుగురిని కలకత్తాలో అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించామని చెప్పారు. అలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఒకరిని, జెఎన్‌టియు విద్యార్థి మహ్మద్ అబ్దుల్ లతీఫ్‌లను బైండోవర్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించామని వివరించారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, త్వరలోనే సివిల్ పోలీసుల నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నగరంలో పేకాట శిబిరాలు, గ్యాబ్లింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. ఈ అంశంలో జంట కమిషనరేట్ల పరిధిలోని పోలీసులకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు.
గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో నేరాలు అదుపులో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది 93,780 కేసులు నమోదవగా, ఈ ఏడాది 0.41 శాతం తగ్గి మొత్తం 93,392 కేసులు నమోదయ్యాయని వివరించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయని వెల్లడించారు.
మహిళలపై నేరాలకు సంబంధించి గత ఏడాది 12,472 కేసులు నమోదగా, ఈసారి 5.44 శాతం తగ్గి 11,794 కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. కాగా అత్యాచార కేసులు గత ఏడాది 781 ఉండగా, ఈ ఏడాది 14.34 శాతం పెరిగి 893కు చేరుకున్నాయని చెప్పారు. ఇలా ఉండగా సైబర్ క్రైమ్ నేరాలు గణనీయంగా 85 శాతం పెరిగాయని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు.

అదుపులోనే నేరాలు... మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ
తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్ధను అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్తామని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. 2014 సంవత్సరానికి సంబంధించి నేరాల వివరాలను సోమవారం అనురాగ్ శర్మ మీడియాకు వివరించారు. మారుతున్న పరిస్ధితులు, టెక్నాలజీకి తగ్గట్టుగా తెలంగాణ పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తామని అన్నారు. టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుని నేరాలను అదుపు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

అదుపులోనే నేరాలు... మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో అధికారుల కొరత ఉన్నప్పటికీ లోటు రానీయకుండా ఉన్న అధికారులతోనే పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించామన్నారు.

అదుపులోనే నేరాలు... మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ
రాష్ట్రంలో పెద్దగా మావోయిస్టుల కదలికలు లేవన్న ఆయన ఈ ఏడాది 68 మంది మావోయిస్టులు తమంతటతాముగా లొంగిపోయారని చెప్పారు. అందులో ఇద్దరు స్పెషల్ కమిటీ సభ్యులు ఉన్నారని అన్నారు. ఉగ్రవాద గ్రూపుల పట్ల ఆకర్షిలవుతున్న వారిని ముందుగానే అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అదుపులోనే నేరాలు... మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ
సిమికి చెందిన షా ముదస్సీర్, షోయబ్ అహ్మద్ ఖాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. సోషల్ మీడియాలో ఉగ్రవాదం పట్ల ఆకర్షితులైన నలుగురిని కలకత్తాలో అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించామని చెప్పారు. అలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఒకరిని, జెఎన్‌టియు విద్యార్థి మహ్మద్ అబ్దుల్ లతీఫ్‌లను బైండోవర్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించామని వివరించారు.
అదుపులోనే నేరాలు... మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, త్వరలోనే సివిల్ పోలీసుల నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నగరంలో పేకాట శిబిరాలు, గ్యాబ్లింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. ఈ అంశంలో జంట కమిషనరేట్ల పరిధిలోని పోలీసులకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు.
అదుపులోనే నేరాలు... మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ
గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో నేరాలు అదుపులో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది 93,780 కేసులు నమోదవగా, ఈ ఏడాది 0.41 శాతం తగ్గి మొత్తం 93,392 కేసులు నమోదయ్యాయని వివరించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయని వెల్లడించారు.

అదుపులోనే నేరాలు... మహిళలపై దాడులు తగ్గాయి: డీజీపీ
మహిళలపై నేరాలకు సంబంధించి గత ఏడాది 12,472 కేసులు నమోదగా, ఈసారి 5.44 శాతం తగ్గి 11,794 కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. కాగా అత్యాచార కేసులు గత ఏడాది 781 ఉండగా, ఈ ఏడాది 14.34 శాతం పెరిగి 893కు చేరుకున్నాయని చెప్పారు. ఇలా ఉండగా సైబర్ క్రైమ్ నేరాలు గణనీయంగా 85 శాతం పెరిగాయని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు.

Click it and Unblock the Notifications