ధరణిపోర్టల్‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Ponguleti Srinivas Reddy: ధరణి పోర్టల్‌లో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు మరింత మేలు జరిగేలా దీన్ని అభివృద్ధి పర్చనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని అన్నారు.
ధరణి పోర్టల్ ప్రక్షాళన కోసం ఇదివరకే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన అన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, సిఫారసులకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి)కి బదిలాయించనట్లు చెప్పారు.

అలాగే తెలంగాణ రికార్డ్స్ ఆఫ్ రైట్ 2020 చట్టంలో లోపాలను సరిదిద్దనున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ చట్టంలో మార్పులు చేస్తామని, కొత్త ఆర్‌ఓఆర్ చట్టం 2024ను ఈ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కొత్త ధరణి యాప్, ఆర్ఓఆర్ చట్టం వల్ల మేలు జరుగుతుందని పునరుద్ఘాటించారు.
రైతులు, భూములు ఉన్న ఆసాములు, ప్రజలకు భరోసా, భద్రత కలిగించేలా ధరణిలో మార్పులు ఉంటాయని పొంగులేటి హామీ ఇచ్చారు. దశలవారీగా కొన్ని మార్పులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. గతంలో పోర్టల్‌లో ఉండే 33 మాడ్యుళ్లల్లో ఏదైనా ఒకదాంట్లో మార్పులు చేయాల్సి వస్తే కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యేవని చెప్పారు. ఆ మాడ్యుల్‌లో చేసిన మార్పులు ఏమిటనేది పబ్లిక్ డొమైన్‌లో డిస్‌ప్లే అయ్యేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
గత ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేకుండానే వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిందని పొంగులేటి విమర్శించారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లను నిర్మించిందని అన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మధ్య 1.52 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందన చెప్పారు.
ధరణి పోర్టల్‌లో మార్పులు చేయడానికి అయిదుమంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్, పదవీ విరమణ చేసిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసూదన్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) సభ్యులు.












Click it and Unblock the Notifications