జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను దగ్గరుండి గెలిపించిన కేటీఆర్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు దగ్గరుండి మరీ గెలిపించారు. ఏకమైనప్పటికీ ఈ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ తల్లి మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో అప్పటినుంచే బీఆర్ఎస్ కు వణుకు ప్రారంభమైంది. అది మొదటి మైనస్. సీటు కేటాయించడమే మొదటి భార్య కుటుంబానికి కాకుండా రెండో భార్య కుటుంబానికి ఇచ్చి పెద్ద తప్పు చేశారు. తర్వాత గోపీనాథ్ కొడుకు విదేశాల నుంచి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం బీఆర్ఎస్ కు రెండో మైనస్.
ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అంటూ ముఖ్యమంత్రిని రెచ్చగొట్టారు. దీంతో సీఎం రేవంత్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. అంతేకాదు.. పోల్ మేనేజ్ మెంట్ లో మంచి అనుభవజ్ఞుడైన సీఎం దాన్ని ఆచరణలో పెట్టారు. ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే ఏ పార్టీలు అభ్యర్థిని నిలబెట్టవు. కానీ ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కిన నీచుడు కేసీఆర్ అంటూ రేవంత్ ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. అందుకు ఉదాహరణగా పి.జనార్దనరెడ్డి మరణించినప్పుడు జరిగిన సంఘటనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ప్రచారంలో మేమే ముందంజలో ఉన్నామంటూ కేటీఆర్ తన సోషల్ మీడియాద్వారా విపరీతంగా ప్రచారం చేయించారు. అయితే రేవంత్ చట్టపరంగా మొదటి భార్య కుటుంబానికి టికెట్ ఇవ్వాలికానీ అలా కాకుండా రెండో భార్య కుటుంబానికి ఎలా ఇస్తారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాడు. గోపీనాథ్ ఆస్తుల కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, దానికి సమాధానం చెప్పాలనే విషయాన్ని కూడ ప్రజల్లోకి రేవంత్ చొప్పించగలిగారు. మజ్లిస్ మీద నమ్మకం పెట్టుకోకుండా అజారుద్దీన్ కు మంత్రి పదవిచ్చి, ముంబయిలో సల్మాన్ ఖాన్ ను కలిసి సాధ్యమైనంతవరకు ముస్లింల ఓట్లను రాబట్టగలిగాడు. రేవంత్ ఇవన్నీ చేయడానికి కేటీఆరే మంచి ప్రేరణ ఇచ్చారు. ప్రచారంలో దూకుడుతోపాటు మాటల్లో దూకుడు, గోపీనాథ్ తల్లిని ఆసుపత్రిలోకి అనుమతించకపోవడం కూడా బీఆర్ఎస్ ఓటమికి కొన్ని కారణాలు.












Click it and Unblock the Notifications