హై అలర్ట్: దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ రోజునే హైదరాబాద్ లో ఉగ్ర కుట్ర..?
దేశంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ లో కోటి మందికిపైగా జనాభా ఉంది. అయితే హైదరాబాద్ మహానగరంలో ఉగ్రకుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉగ్ర కుట్రపై జైలు నుంచే ప్రణాళికలు రచించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ తదితర రద్దీ ప్రాంతాలపై పోలీసులు నిఘా పెంచారు.
నిత్యం రద్దీగా ఉంటే హైదరాబాద్ మహానగరంలో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. 2013 లో దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో తాజాగా ఉగ్ర కుట్ర వార్తలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి. లష్కరే ఈ తోయిబా(LET) ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది జైలు నుంచి కుట్ర చేశాడని కథనాలు వస్తున్నాయి. అయితే ములాకత్ కు వచ్చిన వ్యక్తులతో ఉగ్ర దాడులపై సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది మూలకత్ కు వచ్చిన భార్య ద్వారా సమాచారాన్ని చేరవేసినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ఉగ్రకుట్ర నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాలైన ముసారంబాగ్, సైదాబాద్, మలక్ పేట్ లో పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఇప్పటికే వరుస పేలుళ్లకు కుట్ర చేశారన్న కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.2013 లో దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటన హైదరాబాద్ తో పాటు యావత్ భారత్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే.

2013 లో ఇదే రోజున అంటే ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్, ఏ-1 మిర్చి సెంటర్ వద్ద జరిగిన పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (IM) ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడింది. అయితే కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు పడిన శిక్షలు త్వరగా అమలు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications