తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్: హైదరాబాద్-అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్, ఈ వారాల్లోనే
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర విమానయాన శాఖ. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆదివారం కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీసు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో స్పందించిన కేంద్రమంత్రి సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు అంటే మంగళవారం, గురువారం, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

అడిగిన వెంటనే తమ అభ్యర్థనపై స్పందించి తెలుగు ప్రజలకు ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు సింధియాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ లేఖను తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. లేఖతో పాటు హైదరాబాద్ నుంచి అయోధ్యకు బుక్ చేసుకున్న టికెట్ కూడా జతచేశారు. దీంతో అయోధ్య బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్న తెలుగు వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా కేంద్రం వెసులుబాటు కల్పించినట్లైంది.












Click it and Unblock the Notifications