దేశమంతా తెలంగాణ అభివృద్ధిపై చర్చ.!రైతు దినోత్సవంలో కల్వకుంట్ల కవిత.!
సదాశివనగర్/హైదరాబాద్: సీఎం చంద్రశేఖర్ రావు కృష్టితో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వ్యవసాయం అంటే దండగ అన్న దగ్గరి నుంచి వ్యవసాయం అంటే పండగ అన్న దగ్గరకు సీఎం చంద్రశేఖర్ రావు కృషి చేసారని కవిత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందని తెలిపారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు రైతులు గల్లా ఎగరేసుకునే పరిస్థితికి సీఎం చంద్రశేఖర్ రావు తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో వ్యవసాయం పండుగ : రైతులు అప్పులు లేకుండా ఎప్పటికీ చేతిలో డబ్బు ఉండేలా, ఎవరినీ చేయిచాచి అడగవద్దన్న లక్ష్యం కోసం సీఎం చంద్రశేఖర్ రావు ముందుకెళ్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం చంద్రశేఖర్ రావు పట్ల రైతుల ఆధరణ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరారు. "తెలంగాణ మోడల్ అంటే ఏంటి అని ఇతర ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు అడిగారు. నదీ జలాలను 610 మీటర్ల పైకి ఎత్తిపోసి పొలాలకు నీళ్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్ అని చెప్పాను. ఐదేళ్లలో 65 లక్షల మంది రైతులకు రూ. 65 వేల కోట్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్. ప్రతీ రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ అని చెప్పారు. ఆదే తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరిస్తుంది" అని కల్వకుంట్ల వ్యాఖ్యానించారు.















Click it and Unblock the Notifications