Congress: సీట్ల కేటాయింపుపై సీపీఎం, సీపీఐతో కొనసాగుతోన్న కాంగ్రెస్ చర్చలు..
సీట్ల పంపకంపై సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేయగా.. రెండు, మూడు రోజుల్లో రెండో రెండో జాబితా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎంతో సీట్ల కేటాయింపు పై చర్చలు జరుపుతోంది. సీపీఎం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు సీట్లను కోరుతోంది. అయితే కాంగ్రెస్ తొలి జాబితాలో భద్రాచలం నుంచి పోదెం వీరయ్యకు టికెట్ కేటాయించింది. దీంతో అక్కడ సీపీఎం చోటు లేదని స్పష్టమైంది.
ఇక పాలేరు, మిర్యాలగూడ కేటాయించాలని పట్టుబడుతోంది. అయితే ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వర రావు పాలేరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు సీపీఎంకు కేటాయిస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. దీంతో సీపీఎంకు పాలేరు స్థానం దక్కకపోవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రం మీరు కోరుకున్న చోట ఒకటి.. తామిచ్చిన చోట మరొక సీట్ తీసుకోవాలని చెబుతోంది.

ఇక సీపీఐ సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలను కోరుతోంది. కోరుకున్న చోట ఒక్కటి.. మేమిచ్చిన చోట మరో సీటు తీసుకోవాలని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. దీంతో సీపీఐ కొత్తగూడెం, చెన్నూరుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మునుగోడు కేటాయించాలని సీపీఐ పట్టుబడుతుంది. కాంగ్రెస్ కొత్తగూడెం, చెన్నూరు ఫైనల్ చేసే అవకాశం ఉండడంతో నల్గొండ సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అలక చెందారు. ఖమ్మ నేత కోసం బీసీ నేతను బలిపశువును చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేస్తామని చెబుతున్నారు. సీపీఎం, సీపీఐతో సీట్ల పెంపకం కొలిక్కి వచ్చిన తర్వాతే కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు తొలి జాబితాలో తమ పేర్లు లేవని కొందరు సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. సోమవారం మాజీ మధుయాష్కీ గౌడ్ ఇంట్లో మాజీ ఎంపీలు సురేష్ షెట్కారు, బలరామ్ నాయక్, సిరిసిల్ల రాజయ్య సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications