హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెల్లి ఫోన్ కి ముందు మరో ఫోన్: వెలుగులోకి కొత్త విషయం..దోషులను పట్టించింది 'దిశా'నే

|
Google Oneindia TeluguNews

షాద్ నగర్ సమీపంలో జరిగిన వెటర్నరీ వైద్యురాలి గ్యాంగ్ రేప్, హత్య కేసును పోలీసులు త్వరిత గతిన ఛేదించారు. పోలీసులు ఇంత త్వరగా ఈ కేసును ఛేదించారు, చాలా మిస్టరీ గా ఉన్న ఈ మర్డర్ కేస్ ను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు అంతే త్వరగా దోషులను పట్టుకున్నారు అంటే అందుకు పోలీసులు చాలా ఎఫర్ట్ పెట్టారని అందరూ భావిస్తున్నారు. కానీ దోషులను పట్టించటం లో ప్రధానపాత్ర పోషించింది ఆ నలుగురు మృగాళ్ల చేతిలో అన్యాయంగా బలైపోయిన దిశ అన్న కొత్త విషయం వెలుగులోకి వచ్చింది .

 సోదరికి ఫోన్ చేసిన దిశా .. దాని వల్లే ప్రాధమిక అంచనా

సోదరికి ఫోన్ చేసిన దిశా .. దాని వల్లే ప్రాధమిక అంచనా

దోషులను పట్టుకోవడంలో ఆమె చేసిన పని కీలకంగా ఉపయోగపడింది.దిశ హత్య కేసులో ఆమె తన సోదరి కి కాల్ చేసి భయంగా ఉంది పాపా అని చెప్పడం, తనకు సహాయం చేస్తామని లారీ డ్రైవర్లు చెప్పారని, వారిపై ఎందుకో ఏదో అనుమానంగా ఉందనిచెప్పకపోతే ఆమె అత్యాచారం, హత్య, ఆమెను దహనం చేసిన ఘటన మిస్టరీగానే మిగిలిపోయేవి. ఇక ఆమె ఫోన్ కాల్ నేపథ్యంలోనే లారీ డ్రైవర్ల పనేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు.

మొబైల్ లో ఓ కొత్త నంబర్ కు కాల్ చేసినట్టు గుర్తించిన పోలీసులు

మొబైల్ లో ఓ కొత్త నంబర్ కు కాల్ చేసినట్టు గుర్తించిన పోలీసులు

అయితే వారిని ఎలా పట్టుకున్నారు? వారు ఎవరు అనేది పోలీసులు ఎలా గుర్తించారు ? ఇంత త్వరితగతిన ఎలా వారిని అదుపులోకి తీసుకో గలిగారు? అనేవి ఇప్పుడు అందరు ఆలోచిస్తున్న ప్రశ్నలు. పోలీసులు వారిని పట్టుకోవడంలో, గ్యాంగ్ రేప్, హత్యకు పాల్పడిన వాళ్లు వీళ్లే అని నిర్ధారించడంలో మృతురాలు దిశ కీలక భూమిక పోషించారు. ఎలా అంటే తన స్కూటీకి పంచర్ చేయిస్తానని చెప్పి వాహనాన్ని తీసుకువెళ్లిన ఏ 1 నిందితుడు ఆరిఫ్ ఫోన్ నెంబర్ కు ఆమె కాల్ చేయడం వల్ల ,ఆ ఫోన్ నెంబర్ ద్వారా నిందితులను పట్టుకోగలిగారు పోలీసులు.

కాల్ డేటా ఆధారంగా నిందితుడి నంబర్ గా గుర్తించిన పోలీసులు

కాల్ డేటా ఆధారంగా నిందితుడి నంబర్ గా గుర్తించిన పోలీసులు

దిశ కాల్ డేటా పరిశీలించిన పోలీసులు తన సోదరికి కాల్ చేయడానికి ముందు, నిందితుడు ఆరిఫ్ కు కాల్ చేసింది. తన బండి రిపేర్ ఎంతవరకు అయింది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నమే నిందితులను త్వరగా పట్టుకోవడానికి కారణమైందని తెలుస్తోంది. ప్రియాంక ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు సోదరి కి ఫోన్ చేయడానికి ముందు ఉన్న నంబరు ఎవరిది అన్న ఆసక్తి కలిగింది.

లారీల వివరాలు సేకరించిన పోలీసులు

లారీల వివరాలు సేకరించిన పోలీసులు

ఇక ఈ నేపథ్యంలో ఆ నంబరు ఎవరిది అనేది చెక్ చేయగా ఆరిఫ్ అని తెలిసింది. అతను ఏం చేస్తుంటాడు అనేది ఆరా తీయగా లారీ డ్రైవర్ అని గుర్తించారు పోలీసులు. ఇక ఇదే సమయంలో టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న లారీల వివరాలు సేకరించిన పోలీసులు వాటి యజమానులు, వారి లారీ డ్రైవర్ల ఫోన్ నెంబర్లను సేకరించారు. ఈ క్రమంలో ఆరిఫ్ నంబర్ శ్రీనివాస్ రెడ్డి అని లారీ యజమాని ఇచ్చిన నంబర్ తో మ్యాచ్ అయింది.

తనను హతమార్చిన వారి వివరాలు అందించిన 'దిశ' కాల్ డేటా

తనను హతమార్చిన వారి వివరాలు అందించిన 'దిశ' కాల్ డేటా


దీంతో వెంటనే అతని అడ్రస్ తీసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక అతని ద్వారా మిగతా నిందితులను కూడా పట్టుకున్నారు పోలీసులు. ఇలా తనను హతమార్చిన వారి వివరాలను అందించి తన కేసుకు తానే సహకరించింది మృతురాలు దిశ. పోలీసులకు దిశానిర్దేశం చేసి త్వరితగతిన దోషులను పట్టించింది ఆమె చేసిన పని అని ఇప్పుడు చర్చ జరుగుతుంది.

దిశ తెలివిగా ప్రవర్తించలేదని తెలంగాణా మంత్రుల వ్యాఖ్యలు తప్పు

దిశ తెలివిగా ప్రవర్తించలేదని తెలంగాణా మంత్రుల వ్యాఖ్యలు తప్పు

చదువుకున్న అమ్మాయి అయినా తెలివితక్కువగా ప్రవర్తించింది అని, టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లి లేకపోయిందని, 100కు డయల్ చేయలేకపోయిందని రకరకాల విమర్శలు ఆమె విషయంలో వ్యక్తమయ్యాయి. కానీ లారీ డ్రైవర్ ల విషయంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తన కంటే చిన్న వాళ్ళుగా ఉన్న వారు తనను ఏమీ చెయ్యరు అని భావించిన నేపథ్యంలోనే ఆమె అక్కడ ఉన్నట్టు ఉంది అని నిందితులను చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది.

పోలీసుల ఘనత కాదు .. దిశా చేసిన ఫోన్ కాల్ నే కేసు తేలటానికి కారణం

పోలీసుల ఘనత కాదు .. దిశా చేసిన ఫోన్ కాల్ నే కేసు తేలటానికి కారణం

ఈ కేసులో పదిహేను బృందాలను పెట్టి గాలించి దోషులను పట్టుకున్నామని చెప్పిన పోలీసుల ఘనత ఇందులో పెద్దగా ఏమీ లేదని , పోలీసులు ఇంత త్వరగా ఛేదించడానికి ఆమె చేసిన పనే కారణమని ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పని చేయాల్సిన అవసరం ఉంది. దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు అన్న చందంగా కాకుండా పోలీసులు మహిళా రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది.

English summary
Gang rape and murder of veterinary doctor near Shadnagar The police quickly solved the case, and the mysterious murder case,was caught by the police as quickly as possible. But a new issue has emerged, the victim Disha has called the accused before she calls to her sister. the call helped the police to trace out the accused quickly .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X