‘సంక్షోభం దిశగా దేశం.. రాష్ట్రానికి కొత్త దొర’ (పిక్చర్స్)
హైదరాబాద్: దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి హెచ్చరించారు. సిపిఎం తెలంగాణ మహాసభల ముగింపు సందర్భంగా నిజాం కాలేజీ మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో మూడు సీట్లు రావడమే బిజెపి పాలనకు నిదర్శనమని అన్నారు.
10 ఏళ్ల అధికారంలో మన్మోహన్ చేసిన విదేశీ పర్యటనల కంటే 9 నెలల వ్యవధిలో నరేంద్ర మోడీ చేసిన విదేశీ పర్యటనలే ఎక్కువ అని సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రాంతంలో దొరల రాజ్యం పోయిందంటే.. ఇప్పుడు కొత్త దొర వచ్చిండు' అని ఆవేదనగా చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే స్థలం దొరకదు, గానీ, ఫ్యాక్టరీ పెట్టాలంటే 50వేల ఎకరాల భూమి దొరుకుతుందని ఆమె ఆరోపించారు.
ప్రజాసమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం దొరల రాజ్యం కాదని నిరూపించుకోవాలని అన్నారు. కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులు అని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అన్న చంద్రబాబు పాలనలో ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్ అయిందని, హరితాంధ్రప్రదేశ్ అన్న వైఎస్ పాలనలో అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిందని చెప్పారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధిని సిపిఎం కోరుకుంటోందని సిపిఎం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని తమ్మినేని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ఏ మార్గంలో నడవాలనేదానిపై మహాసభల్లో చర్చించామని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామనే మాటలతో తెలంగాణ అభివృద్ధి చెందదని, పారిశ్రామికాభివృద్ధి రాష్ట్ర నలుమూలలా జరగాలని తమ్మినేని సూచించారు.

సిపిఎం మహాసభలు
దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి హెచ్చరించారు.

సిపిఎం మహాసభలు
సిపిఎం తెలంగాణ మహాసభల ముగింపు సందర్భంగా నిజాం కాలేజీ మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో మూడు సీట్లు రావడమే బిజెపి పాలనకు నిదర్శనమని అన్నారు.

సిపిఎం మహాసభలు
10 ఏళ్ల అధికారంలో మన్మోహన్ చేసిన విదేశీ పర్యటనల కంటే 9 నెలల వ్యవధిలో నరేంద్ర మోడీ చేసిన విదేశీ పర్యటనలే ఎక్కువ అని సీతారాం ఏచూరి అన్నారు.

సిపిఎం మహాసభలు
అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను మోడీ సర్కార్ ఆహ్వానిస్తోందని ఆరోపించారు.

సిపిఎం మహాసభలు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రాంతంలో దొరల రాజ్యం పోయిందంటే.. ఇప్పుడు కొత్త దొర వచ్చిండు' అని ఆవేదనగా చెప్పారు.

సిపిఎం మహాసభలు
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే స్థలం దొరకదు, గానీ, ఫ్యాక్టరీ పెట్టాలంటే 50వేల ఎకరాల భూమి దొరుకుతుందని ఆమె ఆరోపించారు.

సిపిఎం మహాసభలు
ప్రజాసమస్యల పరిష్కారానికి ఎంత వరకైనా పోరాడతామని ఆమె తేల్చిచెప్పారు. రాష్ట్రంలో గొర్రెలు తినేవారుంటే ..కేంద్రంలో బర్రెలను తినేవారు వచ్చారని ఆరోపించారు.

సిపిఎం మహాసభలు
సచివాలయంలో మీడియా ఆంక్షలపై తెలంగాణ ప్రజాశక్తి ఎడిటర్ ఎస్ వీరయ్య మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవల్సిన అవసరం అందరిపై ఉందని అన్నారు. యాదగిరి గుట్టలో జర్నలిస్టులను బంధించడం ఎంత వరకూ సబబో ముఖ్యమంత్రి చెప్పాలని అన్నారు.

సిపిఎం మహాసభలు
ప్రజాసమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం దొరల రాజ్యం కాదని నిరూపించుకోవాలని అన్నారు. కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులు అని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు.
రానున్న రోజుల్లో వామపక్షాలు ఏకం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిపిఎం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 13 మందితో కార్యదర్శివర్గం, 60 మందితో కార్యవర్గాన్ని మహాసభ ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన తొలి మహాసభకు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications